వరుస సినిమాలతో దర్శకుడు కళ్యాణ్ జి గోగణ హవా

ఒక సినిమాను ఎంత త్వరగా ఫినిష్ చేశారు.. ఎంత క్వాలిటీగా తీశారు అనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు సినిమాలను చాలా ఫాస్ట్‌గా తీసినా ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంకొందరు సినిమాలను మెల్లిగా తీస్తుంటారు. కానీ కొత్త కథలను ఎంచుకుంటూ మేకింగ్ పరంగా కొత్తదనాన్ని చూపిస్తూ సినిమాను అతి వేగంగా పూర్తి చేయగల దర్శకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కళ్యాణ్ జి గోగణ ముందుంటారు.

Click Here To Watch

నాటకం సినిమాతో కళ్యాణ్ జి గోగణ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమాతో కళ్యాణ్ జి గోగణకు మంచి పేరు వచ్చింది. మళ్లీ అదే బ్యానర్‌లో సుందరి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన కాదల్, తీస్ మార్ ఖాన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అలా నిర్మాతలకు సపోర్టివ్‌గా సినిమాలను వేగంగా తెరకెక్కిస్తూ మంచి దర్శకుడిగా నిరూపించుకున్నారు కళ్యాణ్ జి గోగణ. ఆయన ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న తీస్ మార్ ఖాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా అవుట్ పుట్, దర్శకుడి పనితనం నచ్చిన నిర్మాత తిరుపతి రెడ్డి, హీరో ఆది మరొక సినిమాను కళ్యాణ్ జీ గోగణతో చేయబోతోన్నారు. తీస్ మార్ ఖాన్ సినిమా ఇంకా పూర్తి కాకముందే మరో చిత్రాన్ని కూడా ఓకే చేశారు. అలా నిర్మాత, హీరోలను మెప్పిస్తూ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజన్ ఉన్న దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ దూసుకుపోతోన్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus