స్టార్ డైరెక్టర్ రాజమౌళి శిష్యులలో కరుణ కుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన కరుణ కుమార్ ద్రోణ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు. కరుణ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి దగ్గర స్టూడెంట్ నంబర్ 1 నుంచి యమదొంగ సినిమా వరకు పని చేశానని అన్నారు. ద్రోణ సినిమా తర్వాత కరుణ కుమార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే తెలుగు సినిమాకు దర్శకత్వం వహించారు.
ద్రోణ మూవీ తర్వాత కెరీర్ లో గ్యాప్ రావడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే రాలేదని కరుణ కుమార్ చెప్పారు. రాజమౌళి గారిని బర్త్ డే సమయంలో పండుగల సమయంలో కలుస్తానని రాజమౌళి బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కువగా కలవడానికి వీలు పడదని కరుణ కుమార్ తెలిపారు. రాజమౌళి కష్టపడి సంపాదిస్తే వచ్చేదానిలో తృప్తి వేరని కష్టంలో నిజాయితీ ఉంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారని కరుణ కుమార్ అన్నారు.
రాజమౌళి సొంతంగా కష్టపడి విన్ అయిన వాళ్లనే ఇష్టపడతారని భయాన్ని వ్యక్తం చేసేవాళ్లను రాజమౌళి ఇష్టపడరని కరుణ కుమార్ చెప్పుకొచ్చారు. లైఫ్ తో ఫైట్ చేసేవాళ్లు అంటే రాజమౌళికి ఇష్టమని కరుణ కుమార్ తెలిపారు. శాంతి నివాసం సీరియల్ సమయంలోనే రాజమౌళి స్టార్ డైరెక్టర్ అవుతారని చెప్పేవాడినని రాజమౌళి కుటుంబంలో మనిషిలా తాను పెరిగానని కరుణ కుమార్ కామెంట్లు చేశారు.