బాలయ్య షోకి ఆ ‘ఇద్దరిని’ కూడా పిలిచి ఉంటే బాగుండేదంటూ రచ్చ చేస్తున్నారు..!

నటసింహ నందమూరి బాలకృష్ణ హెస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్‌లో టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయబోతున్నాడు.. ఈ సీజన్‌లో ఇద్దరేసి గెస్టులుగా వస్తున్నారు కాబట్టి.. డార్లింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ ‘మాచో స్టార్’ గోపిచంద్‌ని కూడా తీసుకొచ్చాడు. షూట్ సండే కావడంతో పెద్ద ఎత్తున జనాలొచ్చారు.. దెబ్బకి పిక్స్, వీడియోస్ లీక్ చేసేయ్యడంతో నెెట్టింట తెగ వైరల్ అయ్యాయి.. తర్వాత వదిలిన అఫీషియల్ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ప్రభాస్ షర్ట్ కాస్ట్ గురించి, డార్లింగ్ బాలయ్యకి, గోపికి ఇంటి నుండి బిర్యానీ చేయించి తీసుకొచ్చాడని.. అసలు బాలయ్య ఎలాంటి ప్రశ్నలడిగారు?.. పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ ఏం చెప్పాడు?.. ఫోన్‌లో రామ్ చరణ్ ఏమన్నాడు?.. గోపి, బాలయ్య దగ్గర ఫ్రెండ్‌ని ఎలా ఇరికించాడు?.. ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..ఇక లాభం లేదు అనుకుని.. మంగళవారం (డిసెంబర్ 13) రాత్రి 11:15 గంటలకు గ్లింప్స్ వదిలారు.. తర్వాత 15 సాయంత్రం గోపి చంద్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు..

అంతకు కొద్దిగా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు షోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కన్ఫర్మేషన్ వచ్చింది. ఆయనతో పాటు ఎలాగూ త్రివిక్రమ్ వస్తారు అది అందరికీ తెలిసిన విషయమే. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. పవన్‌తో ‘హరి హర వీరమల్లు’ డైరెక్టర్ క్రిష్ కూడా మధ్యలో యాడ్ అవబోతున్నారట.. డిసెంబర్ 27న పీకే షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. సంక్రాంతికి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్‌లో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ..

ఇప్పుడు బాలయ్య షోకి ఆ ‘ఇద్దరిని’ కూడా పిలిచి ఉంటే బాగుండేదంటూ రచ్చ చేస్తున్నారు.. దీంతో ఎవరా ఇద్దరు?.. నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు చేస్తున్నారు.. చిరంజీవి, రామ్ చరణ్ అని కొందరు.. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ అని.. చిరు, వెంకటేష్ అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ ఇద్దరు అనగానే ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లే వినిపిస్తున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus