Director Krish: హరిహర వీరమల్లు విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయిన క్రిష్!

2020 సంవత్సరంలో “హరిహర వీరమల్లు” సినిమాని మొదలుపెట్టినప్పుడు క్రిష్ చాలా గర్వంగా ఈ చిత్రాన్ని ఎనౌన్స్ చేయడం దగ్గర నుంచి టీజర్ రిలీజ్ వరకు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అనంతరం ప్రాజెక్ట్ డిలే కారణంగా కావచ్చు లేదంటే కథనం విషయంలో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సుల వల్ల కావచ్చు ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఎక్కడా ప్రాజెక్ట్ ను తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇబ్బందికరమైన ట్వీట్లు చేయడం గానీ చేయలేదు. క్రిష్ సైలెంట్ గా అనుష్కతో “ఘాటి” షూట్ లో బిజీ అయిపోయాడు.

Director Krish

అయితే.. నిన్న “హరిహర వీరమల్లు” ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మరియు ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా క్రిష్ పేరు ప్రస్తావించడం అనేది దర్శకుడిగా, రచయితగా క్రిష్ కి పవన్ ఇచ్చిన గౌరవం ఏంటి అనేది అర్థమైంది. దాంతో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న క్రిష్ ఓపెన్ అయ్యాడు.

ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత మొదటిసారి క్రిష్ “హరిహర వీరమల్లు” విషయమై ట్వీట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ మరెవరి వల్ల సాధ్యపడదని.. పవన్ కళ్యాణ్ లోని ఫైర్ ను ఏ కెమెరా క్యాప్చ్యూర్ చేయలేదని, ఏ.ఎం.రత్నం అకుంఠిత దీక్ష మాత్రమే ఈ సినిమా పూర్తవ్వడానికి కారణమని పేర్కొంటూ.. సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే.. క్రిష్ తన ట్వీట్ లో ఎక్కడా ప్రస్తుత దర్శకుడు జ్యోతి కృష్ణ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.

మొత్తానికి క్రిష్ కూడా ఈ సినిమాపై స్పందించడం, పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు క్రిష్ పేరు ప్రస్తావించడంతో పవన్ & క్రిష్ నడుమ ఏవో క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయనే టాక్స్ అన్నీ ట్రాష్ అయిపోయాయి. ఏదేమైనా క్రిష్ ఒకవేళ ఈ సినిమాని పూర్తిచేసి ఉంటే.. హరిహర వీరమల్లు క్రేజ్ ఈరోజున మరో విధంగా ఉండేది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

విశ్వరూపం అనకండి సార్.. భయమేస్తుంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus