నవలలు సినిమాలుగా తెరకెక్కడం టాలీవుడ్‌కి కొత్తేం కాదు. చాలా గొప్ప గొప్ప నవలలు సినిమాలుగా వచ్చి విజయం సాధించాయి. ఇటీవల కాలంలో ఆ ఒరవడి తగ్గినా… మళ్లీ ‘కొండపొలం’తో షురూ చేశారు ప్రముఖ దర్శకుడు క్రిష్. ఇప్పుడు మరో నవలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని చూస్తున్నారు. అయితే ఈసారి సినిమాగా కాకుండా వెబ్‌సిరీస్ రూపంలో దానిని తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఈ వెబ్ సిరీస్ చేస్తారని సమాచారం.
తెలుగు నవలా ప్రపంచంలో ‘కన్యా శుల్కం’ నవలకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి సాహిత్యం, కథ, కథనం గురించి చర్చ వచ్చినప్పుడల్లా ‘కన్యా శుల్కం’ పేరు తప్పక చర్చకు వస్తుంది. అంతలా నవలా ప్రపంచంలో, రచనా ప్రపంచంలో ప్రభావం చూపించిన రచన అది. దానినే ఇప్పుడు క్రిష్ వెబ్ సిరీస్‌గా మార్చాలని చూస్తున్నార. ఆయన సహకారంతో అతని శిష్యుడు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తారట. అయితే ఏ పాత్రలో ఎవరు అనేది ఇంకా నిర్ణయం కాలేదని సమాచారం.
తెలుగులో కంటెంట్ పెంచుకునేందుకు సోనీ లివ్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే క్రిష్‌తో ఈ సిరీస్ రూపొందించే పనిలో పడిందని టాక్. ‘మైదానం’ నవలను కూడా వెబ్ ఫిల్మ్ / సిరీస్‌గా రూపొందించాలని చాలా రోజుల క్రితం ప్రయత్నాలు సాగిన విషయం తెలిసిందే. ‘ఆహా’ కోసం ఆ సిరీస్ అని చెప్పారు. కానీ ఆ తర్వాత దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. వేణు ఉడుగుల ‘మైదానం’ కోసం దర్శకుడు అవుతారని కూడా అన్నారు.
సినిమాల్లో తనదైన ముద్ర వేసిన క్రిష్ వెబ్ సిరీస్‌ల విషయంలోనూ రాణించారు. ‘ఆహా’ వచ్చిన తొలినాళ్లలో ‘మస్తీస్’ అనే సిరీస్ చేశారు. దానికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ‘కన్యాశుల్కం’ చేస్తున్నారు. ఇది సకసెస్ అయితే… ఇలాంటి మరిన్ని నవలలు సిరీస్‌లుగా మారుతాయి. ఇక సినిమాల సంగతి చూస్తే… కొత్త సంవత్సరంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరిగాయి.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!