Lingusamy: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ లింగుస్వామి!

ప్రస్తుతం సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటూ ఉంటే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మాత్రం భాషా బేధం అంటూ పెద్ద ఎత్తున దర్శక నిర్మాతలు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే భాషా వివాదం రోజురోజుకు ముదురుతోందని చెప్పాలి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎక్కువ ప్రాధాన్యత తెలుగు సినిమాలకి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక సినిమాలో కూడా భారీ స్థాయిలో పోటీపడుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో మొదట ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని అనంతరం డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇది జరిగే పని కాదని వెల్లడించారు. ప్రస్తుతం సినిమాలకు భాషతో సంబంధం లేదని ఏ సినిమాలో కంటెంట్ ఉంటే అదే సినిమాని మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఈయన తెలియజేశారు.ఇలా తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పడంతో తమిళ దర్శకుడు లింగుస్వామి ప్రొడ్యూసర్ కౌన్సిల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ హీరోగా వరీసు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా తమిళ భాషలో నిర్మించి తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంక్రాంతి రేసులో భాగంగా తక్కువ థియేటర్లో అవకాశం కల్పించాలని తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పరోక్షంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై డైరెక్టర్ లింగుస్వామి స్పందించి వరిసు సినిమాకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సరైన స్థాయిలో థియేటర్లు ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఈయన వార్నింగ్ ఇచ్చారు.బిఫోర్ వరిసు, ఆఫ్టర్ వరిసులా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోందని చెప్పాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus