Lokesh Kanagaraj: ‘విక్రమ్’ సినిమా సక్సెస్ పై లోకేష్ స్పందన!

‘విక్రమ్’ సినిమా తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కోలీవుడ్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇక వీకెండ్ లో వంద కోట్ల క్లబ్ లోకి చేరుకుంది ఈ సినిమా. మొత్తానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు. ‘ఖైదీ’ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు లోకేష్. ఆ తరువాత స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేస్తున్నారు.

విజయ్ తో ‘మాస్టర్’ సినిమా తీశారు. అది కూడా పెద్ద హిట్టు. అది సెట్స్ పై ఉండగానే.. ‘విక్రమ్’ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ హీరోగా, నిర్మాతగా లోకేష్ తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాకి మంచి టాక్ వస్తోంది. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో టీమ్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకుల గురించి చెబుతూ లోకేష్ ఎమోషనల్ అయ్యారు.

ఇదివరకెప్పుడూ ఇంత ఎమోషనల్ అవ్వలేదని.. ‘విక్రమ్’ మీద ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ చూసి ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదని.. కమల్ హాసన్ సర్ కు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటానని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ పై స్పందించిన కమల్ హాసన్.. ‘ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందకుండా ఉండటమే ప్రేక్షకులు చూపించిన ప్రేమ రుణం తీర్చుకునేందుకు మార్గం.

నిజాయితీగా పని చేయాలి.. కొత్తదనంతో సినిమాలు చేస్తే వారు దానిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. నా ఎనర్జీ కూడా వారి ప్రేమ నుంచి వస్తుంది..ఈ సారి నీకు అండగా ఉన్నట్టే ప్రతీసారి మా బ్యానర్ నీకు అండగా ఉంటుంది’ అంటూ రాసుకొచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus