Lokesh Kanagaraj: కోవిడ్ టైమ్‌లో మంచి ప్రేమకథ రాసిన లోకేశ్.. కానీ ఆయన మాటలతో!
- November 8, 2024 / 06:47 PM ISTByFilmy Focus
లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అంటే మనకు ఓ రకమైన సినిమాలే గుర్తొస్తాయి. డ్రగ్స్ దందా రిలేటెడ్ సినిమాలను తనదైన యాక్షన్ శైలిలో తెరకెక్కిస్తుంటారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాల్లో సమాజంలో చీకటి కోణాలు చాలానే చూపించారు. ఇప్పుడు రజనీకాంత్‌తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) అంటూ బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారని టాక్. అలాంటి లోకేశ్ కనగరాజ్ ఓ లవ్ స్టోరీ రాశారని తెలుసా? ఆ విషయం ఆయనే చెప్పారు. ‘ఖైదీ’ (Kaithi) , ‘విక్రమ్’(Vikram), ‘లియో’(LEO) లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
Lokesh Kanagaraj

అలాంటి ఆయన కొన్నేళ్ల క్రితం ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే తన టీమ్ రియాక్షన్ చూశాక నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఇటలీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేశ్‌కు ‘మీరు రొమాంటిక్ మూవీస్ ఇష్టపడతారా?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. రొమాంటిక్ సినిమాలు చూడటమంటే నాకు చాలా ఇష్టం. అలా కరోనా – లాక్‌డౌన్ సమయంలో ఓ లవ్ స్టోరీ కూడా రాశారు.

అయితే ఆ కథను తన టీమ్‌లోని ఒకరికి వినిపిస్తే ‘ఇప్పటివరకూ మీరు రాసిన మోస్ట్ వైలెంట్ స్టోరీ ఇదే’ అని అన్నారట. దీంతో ఆ కథను అక్కడే వదిలేశారట లోకేశ్. ఆయన అంత వైలెంట్‌గా ఏం రాశారో కానీ.. టీమ్‌కి నచ్చలేదు. దాంతో మనం లోకేశ్ స్టయిల్ ప్రేమకథను మిస్ అయ్యాం. ఇక లోకేశ్ సినిమాల గురించి చూస్తే.. ‘కూలీ’ సినిమా తర్వాత ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ చేయాల్సి ఉంది.

దీనికి ‘ఢిల్లీ’ అనే పేరు పెడతారు అని లేటెస్ట్ టాక్. ఆ తర్వాత సూర్యతో (Suriya) ‘రోలెక్స్’ సినిమా చేయాల్సి ఉంది. ఆ వెంటనే కమల్ హాసన్‌తో (Kamal Haasan) ‘విక్రమ్ 2’ చేస్తారట. మరోవైపు ఆమిర్ ఖాన్‌తో (Aamir Khan) ఓ సినిమా చేయడానికి లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.














