Maruthi: ‘ది రాజాసాబ్’ రిలీజ్ పై మారుతి కామెంట్స్.. చేతులెత్తేసినట్టేనా?

‘ది రాజాసాబ్’ (The Rajasaab)  సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కి సినిమా రావడం లేదు. రిలీజ్ డేట్ మరో 2 రోజుల్లో ఉన్నప్పటికీ… మేకర్స్ కనీసం సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. దానికి కారణాలు ఇవి అంటూ.. అధికారికంగా స్పందించడం లేదు. దీంతో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ దర్శకుడు మారుతిని (Maruthi Dasari)  టార్గెట్ చేసి.. ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మారుతి వాటిపై స్పందించి తన శైలిలో సమాధానం ఇచ్చి అభిమానుల్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు.

Maruthi

‘సినిమా లేట్ అవుతున్నందుకు ఇబ్బంది ఏమీ లేదు. మీకు కావాల్సిన టైం తీసుకోండి. కానీ ఈ ఏడాది వస్తుందో లేదో చెప్పండి. అప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని బాధ పెట్టరు’ అంటూ ఒక నెటిజెన్ మారుతిని ప్రశ్నించాడు. ఇందుకు మారుతి.. ” ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'(నిర్మాణ సంస్థ) అదే పనిలో ఉంది. ‘సీజీ’ ఔట్పుట్ త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మొత్తం నా ఒక్కడి చేతిలోనే లేదు.

కొంచెం టైం పడుతుంది. దయచేసి ఓపిక పట్టండి. అందరం మంచి ఔట్పుట్ కోసమే పని చేస్తున్నాం’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజెన్.. ‘కనీసం షూటింగ్ ఎంతవరకు అయ్యిందో చెప్పండి. అంతకు మించి మేము మీ నుండి ఆశిస్తుంది ఏమీ లేదు’ అన్నట్టు కామెంట్ చేశాడు. ఇందుకు మారుతి… ‘మా వరకు షూటింగ్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ చేశాం. కాకపోతే కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే సాంగ్స్ పిక్చరైజ్ చేయాలి.

స్టూడియోస్ నుండి వీఎఫ్ఎక్స్ వర్క్ కి సంబంధించి ఔట్పుట్ వస్తే.. వెంటనే సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. మీకు నా వర్క్ చూపించాలనే ఆసక్తి నాలో ఎక్కువగానే ఉంది’ అంటూ బదులిచ్చాడు. ఇటీవల తమన్ (S.S.Thaman)  కూడా సాంగ్స్ ని మళ్ళీ కంపోజ్ చేస్తున్నట్టు తెలిపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించి నవీన్ చంద్ర కామెంట్స్.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus