Maruthi, Prabhas: మారుతికి ఇష్టమైన టాలీవుడ్ స్టార్ ఎవరంటే?

స్టార్ హీరో ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడిన సమయంలో చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇవ్వడం ఏమిటని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మారుతి ప్రభాస్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభాస్ తో సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ప్రభాస్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా తీయాలని తన కోరిక అని ఆయన అన్నారు.

డార్లింగ్, బుజ్జిగాడు సినిమాలలో ప్రభాస్ ఎంత యాక్టివ్ గా కనిపించారో తానూ ప్రభాస్ ను అలానే చూపించాలని అనుకుంటున్నానని మారుతి చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగతంగా ప్రభాస్ అభిమానినని మారుతి కామెంట్లు చేశారు. ఫ్యాన్స్ ను ఉత్సాహరిచే విధంగా తన సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాకు సంబంధించి హీరోయిన్లు, సెట్లు, ఇతర విషయాలకు సంబంధించి కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయని వైరల్ అయిన ఆ కథనాల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన వెల్లడించారు.

పక్కా కమర్షియల్ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఈ సినిమా ఉంటుందని కామెంట్లు చేశారు. డిస్ట్రిబ్యూటర్ ను దృష్టిలో ఉంచుకుని తాను సినిమాలను తీస్తానని మారుతి అన్నారు. ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే సంగతి తెలిసిందే.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 75 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో ప్రభాస్ కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus