‘సలార్'(పార్ట్ 1 : సీజ్ ఫైర్)(Salaar) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) వంటి చిత్రాల విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రభాస్ (Prabhas) . అదే జోష్ తో ‘ది రాజాసాబ్’ ని (The Raja saab) మొదలుపెట్టాడు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ రొమాంటిక్ మూవీ ఇది. వాస్తవానికి మారుతి ఇప్పుడు ఫామ్లో లేదు. కోవిడ్ తర్వాత అతను డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వస్తాయి’ (Manchi Rojulochaie) ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ హీరో అయినా ఛాన్స్ ఇవ్వడం కష్టం.
కానీ ప్రభాస్ పిలిచి మరీ ‘ది రాజాసాబ్’ ఛాన్స్ ఇచ్చాడు. ఇది ఒక హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని ముందుగానే అనౌన్స్ చేశారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ చేసిన సినిమాల్లో కొంచెం తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా నిర్మాతలైన ‘పీపుల్ మీడియా వారు’ వెంటనే అనౌన్స్ చేయలేదు.
2024 సంక్రాంతికి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. అలాగే షూటింగ్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం లేదు. దర్శకుడు మారుతి బయట ఫంక్షన్స్ కి వెళ్లినా అక్కడ కూడా ఈ సినిమా గురించి ఎక్కువగా స్పందించింది లేదు. అయితే నిన్న ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాడు. ఒక రకంగా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.