హాట్ టాపిక్ అయిన నటి రొమాంటిక్ ఫోటో.. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ..!

సినిమా వాళ్ళ ప్రేమ వ్యవరాలు నిత్యం హాట్ టాపిక్కే..! వాటిల్లో నిజం ఉన్నా లేకపోయినా.. వాళ్ళు కలిసున్న ఫోటోలు కనిపిస్తే.. చాలా కథలు రాసేసుకుంటారు నెటిజన్లు. ఒక్కోసారి వీటిని పబ్లిసిటీ కోసం వాడుకోవాలని సెలబ్రిటీలు అనుకుంటారు. వీళ్ళకి ఫీడ్ ఇస్తూ ఉంటారు.మరోపక్క వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ వయసున్న నటులతో నటీమణులు డేటింగ్ చేస్తున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అలాంటిది ఒకటి చెప్పుకోబోతున్నాం. 31 ఏళ్ళ వయసున్న నటి 70 ఏళ్ల వయసున్న నటుడితో ప్రేమలో ఉన్నాను అని చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Actress

వివరాల్లోకి వెళితే…. నటి (Actress) శివంగి వర్మ, 70 ఏళ్ల వయసు కలిగిన గోవింద్ నామ్ దేవ్ తో ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలియజేయడం విశేషంగా చెప్పుకోవాలి. తన సోషల్ మీడియా ఖాతాలో గోవింద్ నామ్ దేవ్ తో కలిసున్న ఓ రొమాంటిక్ ఫోటోని షేర్ చేసి ‘ప్రేమకు వయసు వంటి లిమిట్స్ ఏమీ లేవు’ అన్నట్టు రాసుకొచ్చింది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. శివంగి పోస్ట్ చూసిన నెటిజన్లు.. తమ స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.

‘నువ్వు చెప్పింది కరెక్టే.. ప్రేమకి డబ్బు వంటి షరతులు, పరిమితులు ఏమీ లేవు. డబ్బు ఉంటే చాలు. అది చూసే కదా నువ్వు.. నీ తండ్రి వయసున్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నావ్’ అంటూ విరుచుకుపడుతున్నారు. మరికొంతమంది ‘వీళ్ళు ఏదైనా సినిమాలో కలిసి నటిస్తున్నారేమో.. దానికి పబ్లిసిటీ తెచ్చేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు’ అంటూ అభిప్రాయపడుతున్నారు. మరి నిజమేంటో తెలీదు కానీ.. ప్రస్తుతానికి వీళ్ళ రొమాంటిక్ ఫోటో మాత్రం వైరల్ అవుతుంది.

ఒకేసారి రెండు ప్రాజెక్టులు.. చిరు ప్లానింగ్ మామూలుగా లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus