Director Maruthi: వైరల్ అవుతున్న దర్శకుడు మారుతి కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో మాత్రం పక్కా కమర్షియల్ టికెట్ రేట్లలో పెద్దగా మార్పు లేదని తెలుస్తోంది. దర్శకుడు మారుతి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ

నేను దర్శకుడిగా ఏ సినిమా చేసినా ప్రేక్షకుడిలా ఆలోచిస్తానని నా దృష్టిలో నేను దర్శకుడిని కాదని మీడియేటర్ నని మారుతి చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు ప్రొడ్యూసర్లకు మధ్య తాను సంధాన కర్తలా ఉంటానని మారుతి కామెంట్లు చేశారు. ఎలాంటి కథలో అయినా ఎలాంటి పాత్రలో అయినా చిరంజీవి చేయగలరని అయితే నా బలాలు ఏంటో నేను ఆయనను ఏ విధంగా చూడాలనుకుంటున్నానో అదే ముఖ్యమని మారుతి తెలిపారు. నా దగ్గర ఉన్న కొన్ని లైన్ల గురించి చిరంజీవి గారితో మాట్లాడానని పూర్తి కథ సిద్ధం కావాల్సి ఉందని మారుతి తెలిపారు.

చిరంజీవి గారు నాతో కలిసి పని చేస్తానని చెప్పిన మాటలు ఎనర్జీని ఇచ్చాయని ఆయన అన్నారు. మంచి ప్రేక్షకుడు మంచి దర్శకుడు అవుతాడని మారుతి చెప్పుకొచ్చారు. మన నటులు నటిస్తే మాత్రమే భాష, యాస వెలుగులోకి వస్తాయని మారుతి కామెంట్లు చేయడం గమనార్హం. ఏ సినిమా కోసం ఎంత ఖర్చు చేయాలో ప్రేక్షకులకు అవగాహన ఉంటుందని ఆ మొత్తం కంటే ఎక్కువ మొత్తం టికెట్ రేటు ఉంటే థియేటర్లకు ప్రేక్షకులు రారు అని మారుతి తెలిపారు.

ఆ కారణం వల్లే టికెట్ రేట్లను తగ్గించామని మారుతి పేర్కొన్నారు. ప్రభాస్ తో సినిమా కచ్చితంగా చేస్తానని ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని మారుతి కామెంట్లు చేశారు. కథ, టైటిల్ గురించి వేర్వేరు ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయని మారుతి తెలిపారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus