Maruthi: ప్రభాస్ కారు పై రైడ్ కు వెళ్ళిన దర్శకుడు మారుతి.. వైరల్ అవుతున్న వీడియో

ప్రభాస్ లైఫ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. ప్రభాస్ నిజ జీవితంలో చాలా స్టైలిష్ గా ఉంటాడు. వస్త్రాలంకరణ అనేది ఎలా ఉన్నా.. తన ఇల్లు, కారు వంటివి చాలా కాస్ట్లీ గా ఉండాలి. అలా అని డ్రెస్సింగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాడనుకోండి. ప్రత్యేకంగా అందుకు ఓ డిజైనర్ ను కూడా పెట్టుకున్నాడు. ఇక అసలు మేటర్ ఏంటంటే.. ప్రభాస్ కు విపరీతమైన కార్ల పిచ్చి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా దానిని వెంటనే కొనుగోలు చేసే వరకు నిద్రపోడు.

తన కార్ గ్యారేజీలో చాలా రకాల కొత్త కార్లు ఉన్నాయి. తన మూడ్ ను బట్టి.. ఒక్కో కారు బయటకు తీస్తాడు. ప్రభాస్ గతేడాది లాంబోర్గిని అనే కారు కూడా ఒకటి తీసుకున్నాడు.దీని లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ప్రభాస్ షూటింగ్లకు హాజరయ్యేప్పుడు ఈ కారునే ఎక్కువగా వాడుతున్నాడట. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్టు కె’ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం ఈ కారుని కూడా ఉపయోగించినట్టు వినికిడి.

ఆ విషయం పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ లంబోర్గిని కారేసుకుని ఓ స్టార్ డైరెక్టర్ చక్కర్లు కొట్టాడు. అతను మరెవరో కాదు మారుతి. ప్రస్తుతం ప్రభాస్ .. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ప్రభాస్ కారుతో మారుతి సరదాగా చక్కర్లు కొట్టినట్టు స్పష్టమవుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus