ప్రభాస్ సినిమాపై నాగ్ అశ్విన్ రిప్లై..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ సంవత్సరం మొత్తం నాలుగు సినిమాలకి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ తో కలిసి నాలుగు సినిమాలు ప్యాన్ ఇండియన్ మూవీస్ చేయబోతున్నాడు. అందులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా కూడా ఉంది. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ మరో ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వలేదు. హీరో ప్రభాస్ తో యూనివర్సిల్ కథ చెప్తాను అంటూ ట్విట్టర్లో ఫ్యాన్స్ తో సందడి చేశాడు.

జనవరి ఫస్ట్ వీక్ లో సంక్రాంతికి ఈ సినిమా నుంచి అప్ డేట్ ఉంటుందని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ నాగ్ అశ్విన్ ని ట్యాగ్ చేస్తూ సినిమా అప్ డేట్ గురించి అడిగేస్తున్నారు. ఇక లాభంలేదని అనుకుని దీనిపై రిప్లై ఇచ్చాడు డైరెక్టర్. ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి జనవరి 29వ తేదిన కానీ లేదా ఫిబ్రవరి 26న కానీ ఖచ్చితంగా అప్ డేట్ ఉంటుందని ప్రామిస్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ శాంతిచినట్లుగా అయ్యింది.

నాగ్ అశ్విన్ సినిమాలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో కీలకమైన రోల్ ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ చేస్తున్నారు. ఈసారి ప్యాన్ ఇండియన్ సినిమా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus