పరశురామ్ పెట్ల… మళ్లీ పారితోషికం పెంచేశాడుగా!

పరశురామ్ పెట్ల రైటర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ కలిగిన చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. యువత చిత్రంతో దర్శకుడిగా మారిన ఇతను .. ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. అయితే విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం చిత్రంతో రూ.130 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి … స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు పరశురామ్.

దీంతో అతనికి ఏకంగా మహేష్ బాబు నుండీ పిలుపు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట చిత్రం కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఆ సినిమాకి పరశురామ్ రూ.13 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. ఇటీవల పరశురామ్ … విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. కానీ మరో బడా నిర్మాత అలగడంతో ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది.

ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కార్తీ కి కథ చెప్పి సినిమా ఓకె చేయించుకున్నాడు పరశురామ్. రెంచ్ రాజు అనే ఎప్పుడూ వినని టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు వినికిడి. తెలుగు,తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి పరశురామ్ ఏకంగా రూ.20 కోట్లు పారితోషికం డిమాండ్ చేశాడట.

అతను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వడానికి నిర్మాత ఓకె చెప్పేశారట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్, ఏజెంట్ వంటి బడా సినిమాలను ఆయన నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus