ప్రశాంత్ నీల్… బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి చేసిన ప్రభాస్, యష్ … వైరల్ అవుతున్న ఫోటోలు..!

కే.జి.ఎఫ్ చాప్టర్ 1, కే.జి.ఎఫ్ చాప్టర్ 2… చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్లనే అధిగమించింది కే.జి.ఎఫ్ చాప్టర్ 2. దీంతో అన్ని భాషల స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాలని ఆశపడుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆల్రెడీ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు ఓకే చేసుకున్నాడు.

ప్రభాస్ తో చేస్తున్న చిత్రం ‘సలార్’ కాగా ఎన్టీఆర్ తో చేయబోతున్న చిత్రానికి ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. అయితే ఈ ఇద్దరు హీరోలంతో రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటున్నాడు ప్రశాంత్ నీల్. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ పెళ్లి రోజు నాడు తన భార్యతో సహా వెళ్లి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్పాడు ప్రశాంత్ నీల్. ఇక తాజాగా తన భర్త డే ను ప్రభాస్, యష్ లతో కలిసి జరుపుకున్నాడు. యష్ తో ఆల్రెడీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలు చేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నాడు.

ఇక ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ‘ఈ కాంబోలో మల్టీస్టారర్ కనుక ప్లాన్ చేస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ ను మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లు కలిసి దిగిన ఫోటోని గుర్తుచేసుకుంటున్నారు.

1

2

3

4

5

6

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus