ఆ స్టార్‌ డైరక్టర్‌ ప్రతి సినిమాకు ముందు ‘దంగల్‌’ చూస్తాడట!

బాలీవుడ్‌ సినిమా గురించి గత కొన్నేళ్లుగా రకరకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. హిందీ సినిమా పరిశ్రమ డౌన్‌ఫాల్‌ మొదలైందని కొందరు, మొదలవ్వబోతోందని కొందరు, ఎప్పుడో డౌన్‌ అయిపోయింది అని మరికొందరు అంటూ ఉంటారు. ఈ మాటల్ని అనే వారిలో అగ్ర దర్శకులు తక్కువగా ఉంటారు కానీ అభిమానులు, విమర్శకులు మాత్రం తెగ అంటున్నారు. అయితే ప్రముఖ దర్శకుడు ‘96’ సినిమా ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ మాత్రం ఇంకోలా చెబుతున్నారు. బాలీవుడ్‌ పరిస్థితి అంత ఆరుణంగా ఏమీ లేదు అని అంటున్నారు.

Prem Kumar

‘96’, ‘సత్యం సుందరం’ సినిమాలతో తనంకటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌. ఆయన తన ‘96’ సినిమాను బాలీవుడ్‌ కోసమే రాసుకునర్నారట. అభిషేక్‌ బచ్చన్‌తో ఆ సినిమా చేయాలనుకున్నారట. ఆ సినిమా తెలుగు, తమిళంలో వచ్చేసినా హిందీలో చేయాలనే తన కోరిక అలానే ఉండిపోయింది అని చెబుతున్నారు. ఆ సినిమానే కాదు ‘సత్యం సుందరం’ కూడా బాలీవుడ్‌లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.

ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ సినిమాలో ప్రేమ్‌ కుమార్‌లో స్ఫూర్తినింపిందట. ఏదైనా సినిమా తెరకెక్కించే ముందు తప్పకుండా ‘దంగల్‌’ సినిమా చూస్తారని చెప్పారు. ఈ క్రమంలో హిందీ చిత్ర పరిశ్రమలో సరైన సినిమాలు రావడం లేదని, రోజు రోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయని కొంతమంది అంటున్నారని వైరల్‌ టాపిక్‌ను టచ్‌ చేశారు. ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని, రీసెంట్‌గా ‘అమర్‌సింగ్ చంకీల’ సినిమా చూశానని.. బాలీవుడ్‌లో వచ్చిన గొప్ప చిత్రాల్లో అదీ ఒక్కటి అని మెచ్చుకున్నారు.

దక్షిణాదిలో తెరకెక్కించే చిత్రాల్లో స్థానిక పరిస్థితులు, ఆచార సంప్రదాయాలను ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హిందీ సినిమాల్లో ఆ అంశాలు కొరవడ్డాయి. స్థానిక స్థితిగతులను తెలియజేస్తూ అక్కడ కూడా సినిమాలు తీస్తే మరిన్ని మంచి విజయాలు కచ్చితంగా దక్కుతాయి అని ప్రేమ్‌ కుమార్‌ చెప్పారు. దీంతో బాలీవుడ్‌ మీద డిఫరెంట్‌ థాట్‌ ఉన్న దర్శకుడిగా ప్రేమ్‌ కుమార్‌ కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఇంకెవరైనా ఈ విషయంలో వాయిస్‌ రెయిజ్‌ చేస్తారేమో.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus