Viswam OTT: గోపీచంద్ – శ్రీను వైట్ల సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయిందా?

‘నేను మారిపోయా.. నా సినిమా ఫలితం కూడా మారుతుంది’ అంటూ గోపీచంద్  (Gopichand)   -శ్రీను వైట్ల  (Srinu Vaitla)  ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే వాళ్లు ఎంత మారామని చెప్పినా, మారినా సినిమా ఫలితంలో మాత్రం మార్పు రాలేదు. అందుకేనేమో సినిమా ఓటీటీ విషయంలో ఆలోచనలు మారిపోయాయి. అన్నీ బాగుంటే కాస్త ఆలస్యంగా వద్దామనుకున్న ‘విశ్వం’ (Viswam)  ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా ముందే వచ్చేస్తాం అంటోంది. గోపీచంద్, శ్రీను వైట్ల గత సినిమాలు పెద్దగా ఆడలేదు.

Viswam OTT:

దీంతో ‘విశ్వం’ సినిమా మీద తొలుత పెద్దగా అంచనాలు లేవు. అయితే టీజర్‌, ట్రైలర్‌ కట్‌ చూశాక ఎక్కడో చిన్న ఆశ కలిగింది. మరోవైపు ‘నేను మారిపోయా.. నా కామెడీ మారిపోయింది’ అని శ్రీను వైట్ల చెప్పడంతో చిన్నపాటి నమ్మకాలతోనే సినిమా చూశారు జనాలు. అనుకున్నట్లుగానే కామెడీ మారింది, గోపీచంద్‌ యాక్షన్‌ మారింది. కానీ ఫలితం మాత్రం మారలేదు. ఆఖరికి కావ్య థాపర్‌ అందాలు కూడా సినిమాను రక్షించలేదు.

దసరా పండగ కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను దీపావళి పండగ సందర్భంగా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తారు అని చెబుతున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.12 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో దీపావళీ కానుకగా అక్టోబర్ 29న ఓటీటీకి తెచ్చి క్యాష్‌ చేసుకోవాలని అనుకుంటోందట. పండగ నాడు ఇంట్లో నవ్వులు కావాలంటే సినిమా చూడాలి అని చెప్పబోతోందట.

ఒకవేళ అక్టోబర్ 29న కుదరకపోతే నవంబర్ 3న అయినా సినిమాను ఓటీటీకి తెచ్చే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. చిత్రాలయ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలు ఓటీటీలో మంచి ఫలితమే అందుకుంటూ ఉంటాయి.

న్స్ కి డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదు ‘రెబల్స్’.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus