Devara: దేవర తెలివైన అడుగుల వెనుక రాజమౌళి.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)    దేవర (Devara) ట్రైలర్ తో సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకోగా దేవర ట్రైలర్ లో బీజీఎం ఎలా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దేవర ప్రమోషన్స్ స్ట్రాటజీల వెనుక జక్కన్న ఉన్నారని తెలుస్తోంది. దేవర మూవీ ట్రైలర్ ను ముంబైలో లాంఛ్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగాతో  (Sandeep Reddy Vanga) ఇంటర్వ్యూతో పాటు కపిల్ శర్మ షోలో మూవీ టీమ్ తో కలిసి పాల్గొన్నారని తెలుస్తోంది.

DevaraDevara

మరికొన్ని ఇంటర్వ్యూలు సైతం ఇచ్చి హిందీలో దేవరపై అంచనాలు భారీగా పెరగడానికి జూనియర్ ఎన్టీఆర్ తన వంతు కృషి చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో రాజమౌళి (S. S. Rajamouli) బాహుబలి2 (Baahubali 2) , ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాల ప్రమోషన్స్ కోసం ఎలాంటి స్ట్రాటజీలను వాడారో ఇప్పుడు దేవర సినిమా కోసం అలాంటి స్ట్రాటజీలను తారక్ వాడుతున్నారని తెలుస్తోంది. జక్కన్న పరోక్షంగా ఈ సినిమాకు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర (Devara) సినిమా కర్ణాటక హక్కులు రాజమౌళి కొడుకు కార్తికేయ సొంతమయ్యాయనే సంగతి తెలిసిందే. కర్ణాటకలో తారక్ కు భారీ స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేవర సినిమాకు ఓవర్సీస్ లో షోలు మరిన్ని పెంచాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా వరుస అప్ డేట్స్ తో సినిమా రిలీజ్ వరకు ఊహించని రేంజ్ లో అంచనాలు పెంచనున్నారని తెలుస్తోంది.

దేవర ట్రైలర్ లో కథను ఎంతవరకు చెబుతారో చూడాల్సి ఉంది. దేవర (Devara) ట్రైలర్ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 2,22,000 పోస్ట్ లతో ట్రెండింగ్ లో ఉంది. దేవర ట్రైలర్ నిడివి 2 నిమిషాల 50 సెకన్లు అని తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన దేవర సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయని భోగట్టా.

 టికెట్ల ప్రీ సేల్ లో నయా రికార్డ్.. దేవర రికార్డులు వేరే లెవెల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus