రాజమౌళి (S. S. Rajamouli) .. తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. చాలా కండిషన్స్ పెడుతుంటాడు. ఇవి బయటివారికి చాదస్తంగా అనిపిస్తూ ఉంటుంది. విషయం ఏంటంటే.. మహేష్ బాబుతో (Mahesh Babu) రాజమౌళి సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసి 4 ఏళ్ళు కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలుకాలేదు. మధ్యలో ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) రిలీజ్ హడావిడిలో రాజమౌళి, ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలతో మహేష్ బాబు.. బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు డిలే అయ్యింది.
Rajamouli
‘గుంటూరు కారం’ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా మొదలు పెట్టాలి. అయినా సరే రాజమౌళి టైం తీసుకున్నాడు. మహేష్ కూడా మేకోవర్ పై దృష్టి పెట్టాడు. మొత్తానికి 2024 ఏడాది గడిచిపోయింది. అయినా ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్డేట్ లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్నట్టుగా జరగలేదు. ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan)..లకి గాయాలు అవ్వడం, తర్వాత కొన్ని లొకేషన్స్ కి చివరి నిమిషాల్లో పర్మిషన్స్ క్యాన్సిల్ అవ్వడం..
ఇలాంటి సమస్యలు ఎన్నో తలెత్తాయి. వాటికి తోడు కోవిడ్ కూడా రావడం.., ఇలాంటి వాటి వల్ల సినిమా మరింతగా ఆలస్యం అయ్యింది. అంతేకాదు ‘ఆర్.ఆర్.ఆర్’ ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టాడు జక్కన్న. వాటి వల్ల అవసరం లేని సన్నివేశాలు చాలా తీసేశాడట. వాటి వల్ల బడ్జెట్ పెరిగింది. ఆర్టిస్ట్..ల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. అందుకే మహేష్ బాబు సినిమాకి అలాంటి ఇబ్బందులు రాకుండా పర్ఫెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాడట రాజమౌళి.
పైగా ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారట. వాళ్ళు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్యాచ్ వర్క్..లు వంటివి చేయాలంటే… ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.వాళ్ళ డేట్స్ కి పే చేయాలి, ఫ్లైట్ టికెట్స్ వంటి వాటికి కూడా ఎక్కువవుతాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి జక్కన ఎక్కువ టైం వర్క్ షాప్స్ వంటి వాటిలో పాల్గొంటున్నట్టు సమాచారం.