‘పుష్ప 2’ ఏంటి.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తో కలిసి సందడి చేయబోతుండటం ఏంటి? ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)రిలీజ్ అయ్యి 10 రోజులు దాటింది కదా? మరి వచ్చేనెల 10 న విడుదల కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ తో కలిసి సందడి చేయడం ఏంటి అనుకుంటున్నారా? చెప్పుకోడానికి విడ్డూరంగా అనిపించొచ్చు కానీ ఇది నిజమే..! మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది.
జనవరి 9 నుండి ప్రీమియర్ షోలు పడనున్నాయి. సో ‘గేమ్ ఛేంజర్’ జనవరి 9 నే ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకోవాలి. మరోపక్క అదే రోజు అంటే జనవరి 9 నుండి ‘పుష్ప 2’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కైవసం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ కంటే ఎక్కువగా.. భారీ రేటు చెల్లించి నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘పుష్ప 2’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
దీంతో డిజిటల్ రిలీజ్ 5 వారాల్లో చేసుకోవడానికి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్టు సమాచారం. జనవరి 8 నాటికి ‘పుష్ప 2’ చిత్రం రిలీజ్ అయ్యి.. 5 వారాలు పూర్తవుతుంది. ముందుగా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫిక్స్ చేసుకోవడం జరిగిందట. అందుకు డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సిన ‘పుష్ప 2’ని.. ఒక రోజు ముందుకి జరిపి..
డిసెంబర్ 5కి రిలీజ్ చేశారు మేకర్స్. సో సంక్రాంతి పండుగకు.. కొత్త సినిమాలతో పాటు ‘పుష్ప 2’ సందడి కూడా ఓటీటీల్లో ఉండబోతుందన్న మాట. త్వరలోనే ‘పుష్ప 2’ ఓటీటీ రిలీజ్ పై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.