Ramesh Varma: ఇన్ని సినిమాలు ఒకేసారి ఎందుకో? రమేశ్‌ వర్మ లైనప్‌ చూశారా?

రమేశ్‌ వర్మ (Ramesh Varma) .. ఈ దర్శకుడు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 20 ఏళ్ల దర్శకత్వం కెరీర్‌లో ఆయనకు సరైన విజయం దక్కిందా అంటే లేదు అనే చెప్పాలి. ఆయన ఎంచుకున్న కథలు, వాటి కాన్వాస్‌ చూస్తే, వచ్చిన ఫలితాలు చాలా దూరంగా ఉంటాయి అని చెప్పాలి. అయినా ఆయనకు వరుస అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన దగ్గర చాలానే సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆయన లైనప్‌ చూస్తుంటే స్టార్‌ దర్శకులు, వరుస విజయాలు అందుకున్న దర్శకులకు కూడా అన్ని సినిమాలు లేవు అనిపించకమానదు.

Ramesh Varma

మూడేళ్ల క్రితం రవితేజ (Ravi Teja)  ‘కిలాడీ’(Khiladi)  సినిమాతో వచ్చారు రమేశ్‌ వర్మ. ఆ సినిమా ఆశించిన ఫలితం అయితే అందుకోలేదు. ఇప్పుడు ‘కాల భైరవ’ అంటూ ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. రాఘవ లారెన్స్‌  (Raghava Lawrence) హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ సినిమా ఇటీవల ముహూర్తం జరుపుకుందని సమాచారం ఇది కాకుండా లారెన్స్‌తోనే మ‌రో సినిమా కూడా ఉంటుంది అని అంటున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందాలు జరిగిపోయాయట. ఇదిలా ఉండగా ఆయన ‘కొక్కొర‌కో’ అనే టైటిల్‌తో ఓ సినిమా రెడీ చేశారు అని సమాచారం. ఆంథాల‌జీగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో కోడి పుంజు పాత్ర కీలకంగా ఉంటుంది అని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ హిట్‌ బొమ్మ ‘కిల్‌’ రీమేక్ రైట్స్ ర‌మేష్ వ‌ర్మ ద‌గ్గ‌రే ఉన్నాయట.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు కూడా చేశారట. త్వరలో హీరోను ఓకే చేసుకొని సినిమా స్టార్ట్‌ చేస్తారట. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ అగ్రహీరో ఒకరికి రమేశ్‌ వర్మ ఇటీవల కథ చెప్పారని.. హీరో కూడా ఓకే అన్నారు అని అంటున్నారు. తెలుగులో రవితేజ కూడా ఓ సినిమా చేస్తా అన్నారట. ఇదంతా చూస్తుంటే రమేశ్‌ వర్మ ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు. సరైన విజయయం లేకుండా ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus