అందమైన “తెలంగాణ పోరి” కోసం వెతుకుతున్న శేకర్ కమ్ముల!

వరుణ్ తేజ్ కథానాయకుడీగా దిల్ రాజు నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ క్యూట్ లవ్ స్టోరీ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ఎన్నారై గా నటించనున్నాడు. అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారై కుర్రాడు.. హైద్రాబాద్ లోని ఓ తెలంగాణా అమ్మాయి ప్రేమలో పడితే, ఆ తెలంగాణ కుటుంబం హీరోని ఎటువంటి ఇబ్బందులు పెట్టింది అనే అంశం చుట్టూ వినోదాత్మకంగా సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది.

హీరో వరుణ్ అయినప్పటికీ.. కథ మొత్తం తెలంగాణా అమ్మాయి అయిన హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే సదరు పాత్ర కోసం శేఖర్ కమ్ముల ఓ స్వచ్చమైన తెలుగమ్మాయి.. ముఖ్యంగా తెలంగాణ బాగా వచ్చిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడట.
శేఖర్ కమ్ముల వెతుకులాట త్వరగా పూర్తి కావాలని ఆశిద్దాం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus