RC 15: పక్కా ప్లాన్ తోనే శంకర్ ప్రాజెక్ట్

బాలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ రామ్ చరణ్ 15 ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా శంకర్ మొదటిసారి ఒక తెలుగు హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీంతో కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే రోజుకోటి వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు శంకర్ ఏ సినిమా చేసినా కూడా బడ్జెట్ కంట్రోల్ పెట్టుకుంటు వర్క్ చేసింది లేదు.

కానీ రామ్ చరణ్ సినిమా కోసం మాత్రం శంకర్ పక్కా ప్లాన్ తో నే ముందుకు వెళ్తున్నాడు. దిల్ రాజు కూడా ముందుగానే కండిషన్స్ పెట్టి సినిమా మొదలు పెడుతున్నాడు. దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులన్ని కూడా పూర్తయ్యాయి శంకర్ సినిమా కోసం ఎక్కువగా తెలుగు టెక్నీషియన్స్ తీసుకుంటున్నాడు.సెప్టెంబర్ 8న ఈ సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది జూలైలో పూర్తిచేయాలని శంకర్ ముందుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఇక సెకండ్ హాఫ్ లో పూర్తిగా స్టూడెంట్ పొలిటికల్ లీడర్ గా కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కియారా అద్వానీ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus