Shankar: రెండు సినిమాలు ఒకేసారి.. ప్లాన్ చెప్పేసిన శంకర్!

‘ఆర్ఆర్ఆర్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తరువాత రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తారని అనుకున్నారు.

కానీ సడెన్ గా ‘ఇండియన్ 2’ సినిమా మొదలవ్వడంతో చరణ్ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు శంకర్. కమల్, చరణ్ సినిమాలను సమాంతరంగా డైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పారాయన. సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్, వైజాగ్ లలో చరణ్ సినిమాకి సంబంధించిన షూటింగ్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. శంకర్ కి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో రణవీర్ తో మరో సినిమా ప్లాన్ చేశారు.

అందుకే ఇప్పుడు చరణ్, కమల్ సినిమాలు ఒకేసారి డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ ఇంకా వంద రోజులు చేయాల్సి ఉంటుంది. నెలలో ఒక పది రోజులు రామ్ చరణ్ సినిమా, మరో పది రోజులు కమల్ సినిమా చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను డైరెక్ట్ చేయడమంటే శంకర్ కి ఛాలెంజింగ్ అనే చెప్పాలి.

కానీ ఇంకా డిలే చేస్తే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరింత ఆలస్యమవుతాయని భావిస్తున్నారు శంకర్. అందుకే కమల్, చరణ్ సినిమాల షూటింగ్స్ పేర్లల్ గా చిత్రీకరించబోతున్నారు. మరి ఈ సినిమాలు ఆయనకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయో చూడాలి!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus