Shankar: ‘ఇండియన్2’ విషయంలో తన పంధా మార్చుకున్న శంకర్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు సినిమాలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఆయన ‘ఇండియన్ 2 ‘ ‘గేమ్ చేంజర్’ వంటి సినిమాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఒక షెడ్యూల్ రామ్ చరణ్ సినిమా, మరో షెడ్యూల్ కమల్ హాసన్ సినిమా అంటూ అటు, ఇటు తిరుగుతూ చాలా అవస్థలు పడుతున్నారు. ఈ మధ్యనే రామ్ చరణ్, కియారా అద్వానీ లపై హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరించారు.

అది పూర్తవ్వగానే ‘ఇండియన్ 2 ‘ కోసం తైవాన్ చేరుకున్నారు. కొద్దిరోజులుగా అక్కడ ‘ఇండియన్ 2′ (భారతీయుడు 2’) షూటింగ్ జరుగుతుంది. (Shankar) శంకర్ మ్యాగ్జిమమ్ స్పీడ్ తో ఆ సినిమాని పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు, పాటల విషయంలో శంకర్ చాలా టైం తీసుకుంటారు. కానీ ‘ఇండియన్ 2′ విషయంలో అలా చేయడం లేదు. ఆ ప్రాజెక్టుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వదిలించుకోవాలని శంకర్ భావిస్తున్నారు.

బడ్జెట్ విషయంలో కూడా ఆయన పెంచడం లేదు. కానీ రామ్ చరణ్ సినిమా విషయంలో అలా కాదు. దిల్ రాజుకి దడ పుట్టిస్తూనే ఉన్నారు. ‘ఇండియన్ 2′ నిర్మాతలతో జరిగిన వివాదాలు, కేసులు వంటి కారణాలతోనే ఇలా జరిగుండొచ్చని అంతా అనుకుంటున్నారు. ఇక ‘ఇండియన్ 2’లో కమల్ హాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని  శంకర్ భావిస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus