Director Shankar mother: డైరెక్టర్ శంకర్ ఇంట్లో విషాదం
- May 18, 2021 / 09:35 PM ISTByFilmy Focus
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది ఆయన ఎంతగానో ఆరాధించే తల్లి కన్నుమూశారు. దర్శకుడు శంకర్ చాలా ఇంటర్వ్యూలలో తన తల్లి గొప్పతనం గురించి చెప్పాడు. ఆమె లేకుంటే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని ఎన్నోసార్లు చెప్పాడు. ఇక ఆమె అకస్మాత్తుగా మరణించడంతో శంకర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దర్శకుడు శంకర్ తల్లి ఎస్. ముత్తులక్ష్మి వయసు సంబంధిత సమస్యల కారణంగా కొద్దిసేపటి క్రితం కన్నుమూసినట్లు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఆమె వయస్సు 88 సంవత్సరాలని తెలుస్తోంది. ఇక శంకర్ ఆమె చివరి కర్మలను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం నిర్వహించనున్నారు. సోషల్ మీడియాలో కోలీవుడ్ ప్రముఖులు, అలాగే అభిమానులు శంకర్ తల్లి మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. తన తల్లికి చాలా సన్నిహితంగా ఉన్నానని చాలా ఇంటర్వ్యూలో శంకర్ మాతృత్వం గొప్పతనం గురించి కూడా వివరణ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం శంకర్ పూర్తి చేయాల్సిన ఇండియన్ 2 సినిమా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత రామ్ చరణ్ 15వ సినిమాతో పాటు రణ్ వీర్ సింగ్ తో మరో సినిమాను చేయనున్నాడు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!














