Shankar: శంకర్‌ నవల సినిమా ఆ రికార్డులను చెరిపేస్తుందా..!

  • November 11, 2022 / 03:59 PM IST

దేశంలో భారీ చిత్రాల దర్శకుల జాబితా రాస్తే.. సౌత్‌ నుండి వినిపించే పేర్లలో శంకర్‌, రాజమౌళి పేర్లు కచ్చితంగా ఉంటాయి. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమాలు చేయడంలో వీరిద్దరూ దిట్టే. సినిమాను సాధారణంగా ఊహించుకోవడం, తెరకెక్కించడం వీళ్లకు అలవాటు. అందుకే వరుసగా భారీ సినిమాలు చేస్తూ, అలరిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ వాతావరణం ఉంటుందా అంటే కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. అలా రాజమౌళి రికార్డును శంకర్‌ బద్దలు కొట్టడానికి చూస్తున్నారా? ఏమో ఈ విషయమ్మీదే సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్య ‘అన్నియన్‌’ (తెలుగులో అపరిచితుడు) రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు ఆ సినిమా కాదని, దాని బదులు ప్రముఖ తమిళ నవల ‘వేల్పారి’ని సినిమా తెరకెక్కిస్తారని వార్తలొచ్చాయి. దీంతోపాటు ఈ సినిమాల సిరీస్‌తో రాజమౌళి రికార్డుల మీద శంకర్‌ కన్ను వేశారని అంటూ సోషల్‌ మీడియాలో కథలు కనిపిస్తున్నాయి. అయితే అవుతుందా లేదా అనేది పక్కనపెడితే..

బాలీవుడ్‌ హీరోతో జక్కన్న రికార్డును శంకర్‌ కొట్టగలరా అనేది ప్రశ్న. ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలు కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కానీ రాజమౌళి తెలుగు హీరోలతోనే తీసి హిట్‌ కొట్టారు. బాక్సాఫీసు దగ్గర రికార్డు వసూళ్లు సాధించారు. తెలుగు హీరోలు, ఇతర భాషల నటుల ప్యాడింగ్‌తో ఆ విజయాలు, వసూళ్లు సాధ్యమయ్యాయి. ఆయా సినిమాలను ఫొలో అయ్యేవారికి ఈ విషయం అర్థమైపోతుంది. అలాంటిది శంకర్‌ కేవలం బాలీవుడ్‌ హీరోతో సౌత్‌లోనూ వసూల్లు సాధించాలని అనుకోవడం ఇబ్బంది పెట్టే విషయమే అంటున్నారు.

ఈ క్రమంలో ‘వేల్పారి’ సినిమా కోసం సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో మూడు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచన కూడా ఉందట. దీంతో సరైన రీతిలో సౌత్‌లో ప్రమోట్‌ చేసుకుంటే, సినిమా బాగుంటే భారీ వసూళ్లు సాధించొచ్చు అంటున్నారు. అయితే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ లాంటి ఫక్తు తమిళ కథకు ఇతర ఇండస్ట్రీల్లో సరైన రెస్పాన్స్‌ రాలేదనే విషయం గమనార్హం.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus