Shankar: బాలీవుడ్‌కి తమిళ నవల.. వర్కౌట్‌ అవుతుందా?

శంకర్‌ సినిమా అంటేనే ఒక బ్రాండ్‌. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా.. అందులో శంకర్‌ మార్క్‌ పక్కాగా ఉంటుంది. అలాంటి శంకర్‌ తన పాత సినిమానే రీమక్‌ చేస్తున్నారు అనగానే అభిమానుల్లో చిన్న నిరుత్సాహం కనిపించింది. అందులోనూ బాలీవుడ్‌లో ఆ సినిమా చేస్తుండటం, పవర్‌ హౌస్‌ లాంటి రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆ సినిమా ఉండటంతో.. ‘ఇదేంటి శంకర్‌ ఇలా చేస్తున్నారు’ అని కొంతమంది అభిమానులు అనుకున్నారు. అలాంటి వారిలో మీరూ ఉంటే.. మీకా నిరుత్సాహం ఇక అక్కర్లేదు.

ఎందుకంటే శంకర్‌ – రణ్‌వీర్‌ సింగ్ కాంబినేషన్‌లో అనౌన్స్‌ చేసిన ‘అపరిచితుడు’ రీమేక్‌ దాదాపు ఆగిపోయినట్లే అట. ఈ మేరకు సినిమా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. ‘అన్నియన్‌’ (అపరిచితుడు)కు రీమేక్‌ అనౌన్స్‌ చేసి ఇన్ని రోజులైనా.. ఇంకా మొదలు కాకపోవడంతో ఈ సినిమా ఏమైంది అనే ప్రశ్నలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. రణ్‌వీర్‌ సింగ్‌, శంకర్‌ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఇక ఈ సినిమా కష్టమేమో అనుకున్నారంతా.

అయితే దానిపై క్లారిటీ వస్తుంది అనుకుంటే.. ఏకంగా ‘అపరిచితుడు’ రీమేక్‌ను చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా బదులు ప్రముఖ తమిళ నవల ‘వేల్పరి’ని సినిమాగా తెరకెక్కించాలని శంకర్‌ అనుకుంటున్నారట. ఈ మేరకు రణ్‌వీర్‌ సింగ్‌కి కూడా సమాచారం ఇచ్చారట. అంతా ఓకే అనుకున్నాక త్వరలోనే దీని అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు ‘వేల్పరి’ పెద్ద నవల కావడంతో సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట శంకర్‌. ప్రయోగాలకు రణ్‌వీర్‌ సింగ్‌ ఎప్పుడూ వెనుకాడడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ పక్కా అనుకోవచ్చు అని టాక్‌ వినిపిస్తోంది.

చక్కటి ప్రేమకథకు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. శంకర్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ యాడ్‌ చేసి పర్‌ఫెక్ట్‌ పాన్‌ ఇండియా సినిమాను అందించాలని శంకర అనుకుంటున్నారట. సరైన విజయం లేక చాలా రోజులుగా డల్‌గా ఉన్న బాలీవుడ్‌కి.. ‘వేల్పరి’ లాంటి ఈ ఫక్తు తమిళ కథ ఎంతవరకు ఊపునిస్తుందో చూడాలి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ లాంటి తమిళ నవల ఆధారంగా వచ్చిన సినిమాకు బాలీవుడ్‌లో మంచి రెస్పాన్స్‌ రాలేదు. మరిప్పుడు ‘వేల్పారి’ని తీసుకెళ్తే ఏమవుతుందో.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus