Sree Karthick: ఎమోషనల్ అవుతానేమోనని భయపడే అఖిల్ ఈవెంట్ కు రాలేదా?

డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మంచి హిట్ కావడంతో డైరెక్టర్ శ్రీ కార్తీక్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అలాగే తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి కూడా ఈయన తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటి అమల నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా నటి అమల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా అఖిల్ పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అఖిల్ రావాల్సి ఉండగా చివరి క్షణంలో రాలేకపోయారు.ఈ క్రమంలోనే అఖిల్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రాకపోవడానికి గల కారణాలను డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అఖిల్ సందడి చేయాల్సి ఉంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముందుగా అఖిల్ ఈ సినిమా ప్రీమియర్ షో చూశారు. ఈ సినిమా చూస్తున్న ఈయన తన తల్లి నటనకు ఫిదా అవ్వడమే కాకుండా ఎంతో ఎమోషనల్ అయి ఏడ్చేశారు.ఇలా ఏడవడం వల్ల ఆయన ఆ ఎమోషన్ నుంచి బయటకు రావడానికి సుమారు రెండు రోజుల సమయం పట్టింది. ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరైతే అక్కడ కూడా ఎమోషనల్ అవుతానేమోనని భయపడే ఈ వేడుకకు రాలేదు అంటూ ఈ సందర్భంగా శ్రీ కార్తిక్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో అమల పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని కంటతడి పెట్టిస్తుందని చెప్పాలి. ఒకే ఒక జీవితం టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కావడంతో దర్శకుడు శ్రీ కార్తీక్ పలువురు హీరో నిర్మాతల దృష్టిలో పడ్డారు. అయితే త్వరలోనే ఈయన మరొక సినిమాని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus