దసరా (Dasara) సినిమాతో ఓవర్ నైట్ లో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా రిలీజ్ తర్వాత సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. సినిమాలంటే తనకు ఎంత ఇష్టమో ఈ దర్శకుడు తాజాగా చెప్పుకొచ్చారు.
Srikanth Odela
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన ఈ దర్శకుడు తాను మొదట ఇంటర్ ఫెయిల్ అయ్యానని ఇంటర్ పాసైతే మా నాన్న బీటెక్ చేయిద్దాం అనుకున్నాడని చెప్పుకొచ్చారు. అందుకనే కావాలని ఒక సబ్జెక్ట్ ఆపానని ఆయన కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ కావాలంటే ఇంటర్ పాస్ కావాలని తెలిసిందని శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు.
ఆ విషయం తెలిసిన వెంటనే ఇంటర్ పాస్ అయ్యి ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే అక్కడ కుడా నేను ఫెయిల్ అయ్యానని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో మా నాన్న, బాబాయ్ బీటెక్ లేదా డిగ్రీ జాయిన్ కావాలని చెప్పడంతో కోపం వచ్చి ఇంటర్, టెన్త్, ఏడో తరగతి సర్టిఫికెట్లను తగలబెట్టానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రోచేవారెవరురా (Brochevarevarura) సినిమాలో సైతం ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందని శ్రీకాంత్ అన్నారు.
ఆ సినిమా చూసిన సమయంలో బాబు సేమ్ నా సీనే రాసిండు అని అనుకున్నానని శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీకాంత్ ఓదెల వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల తర్వాత సినిమా కూడా నాని హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ మూవీతో నానికి ఏ రేంజ్ హిట్ దక్కుతుందో చూడాలి.