Sriwass, NTR: తారక్‌ ఆ సినిమా చేసి ఉంటే.. ఈ బ్లాక్‌బస్టర్‌లు వచ్చేవి కావట!

మహేష్‌ బాబు కెరీర్‌లో ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్‌ ఒకటి అయితే.. అవార్డు తెచ్చిన సినిమా మరొకటి. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఓ సినిమా తెరకెక్కి ఉంటే.. ఈ రెండు సినిమాలు వచ్చేవి కావు అని అంటున్నారు ఓ దర్శకుడు. ఈ రెండే కాదు శర్వానంద్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ ‘శతమానం భవతి’ సినిమా కూడా వచ్చేది కాదు అంటున్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – శ్రీవాస్‌ కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా రూపొందాల్సి ఉంది. ఈ మేరకు శ్రీవాస్‌ ఓ కథను సిద్ధం చేసుకుని.. తారక్‌కు వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఓకే అవ్వలేదు. దీంతో శ్రీవాస్‌ వేరే హీరోతో వేరే సినిమా చేశారు. అయితే ఆ కథ.. టాలీవుడ్‌లో మూడు బ్లాక్‌ బస్టర్‌లకు సమానం అని చెబుతున్నారు. ఆ సినిమా వచ్చి ఉంటే.. ఈ మూడు సినిమాల నేపథ్యాలు అందులో ఉండేవని, అందుకే ఈ సినిమా వచ్చేవి కావు అనేది శ్రీవాస్‌ మాట.

గోపీచంద్‌ హీరోగా రూపొందిన ‘రామబాణం’ సినిమా ప్రచారంలో భాగంగా శ్రీవాస్‌ తన గత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడే తారక్‌ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ‘లక్ష్యం’ సినిమా విడుదలైన తర్వాత నిర్మాత దిల్‌ రాజుతో ఓ సినిమా విషయమై చర్చలు జరిపారట శ్రీవాస్. స్టార్‌ హీరోతో ఆ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నట్లు చెప్పారట. సినిమా బేసిక్‌ పాయింట్‌ను వినిపిస్తే ఇటీవల కాలంలో ఇలాంటి నేపథ్యమున్న సినిమాలు రాలేదని, చాలా మంచి సబ్జెక్ట్‌ అని అన్నారట.

దీంతో కొన్ని నెలలు టీమ్‌తో కలసి స్క్రిప్టు పూర్తి చేశారట శ్రీవాస్‌. ఆ తర్వాత (NTR) ఎన్టీఆర్‌ని కలవగా.. ఆ కథ తనకు వర్కౌట్‌ కాదేమోనని అన్నారట. దీంతో ఆ స్టోరీ కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్‌ నో అన్నాక కొన్ని రోజుల తర్వాత పవన్‌ కల్యాణ్‌కు ఆ స్టోరీ చెప్పారట. బాగుందని చెప్పిన ఆయన.. తర్వాత వివిధ కారణాల వల్ల చేయలేదట.

ఒకవేళ అప్పుడు సినిమా వచేసి ఉంటే.. ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’, ‘శతమానం భవతి’ సినిమాలు తెరకెక్కేవి కాదు అని దర్శకుడు శ్రీవాస్‌ చెప్పారు. ఎప్పటికైనా ఆ కథతో సినిమా చేస్తానని చెప్పిన శ్రీవాస్‌.. దానికి సంబంధించిన హంగులు ఇతర సినిమాల్లో కనిపించాయి గానీ సోల్‌ అలానే ఉంది అని శ్రీవాస్‌ అంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus