దర్శకుడు శ్రీవాస్ అందరికీ సుపరిచితమే. ‘లక్ష్యం’ తో దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ తర్వాత ఆయన చేసిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘లౌక్యం’ ‘డిక్టేటర్’ ‘సాక్ష్యం’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓవరాల్ గా గోపీచంద్ తో చేసిన సినిమాలు తప్ప.. మిగిలిన హీరోలతో శ్రీవాస్ చేసిన సినిమాలు విజయవంతం కాలేదు. దీంతో ఫైనల్ గా మళ్ళీ శ్రీవాస్ తోనే ఇతను ‘రామ బాణం’ అనే చిత్రం చేశాడు. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు శ్రీవాస్ (Sriwass) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో ఇతను చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యిందో చెప్పి షాకిచ్చాడు. శ్రీవాస్ మాట్లాడుతూ.. ” ‘లక్ష్యం’ సినిమా తర్వాత దిల్ రాజు నాతో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. నాతో ఆయన ఈ విషయం చెప్పాక మంచి కథను రెడీ చేశాను. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు అయితే బాగుంటుందని ఆయనకు నెరేట్ చేసినప్పుడు చెప్పాను.
దిల్ రాజు 10 నిమిషాలు కథ విని ఇది అద్భుతమైన కథ, మనం చేయాలి, ఎవరికైతే బాగుంటుంది అని అడిగారు. తారక్‌కు అయితే బాగుంటుందని నేను చెప్పాను. ఒక 20 రోజులు కథ మీద వర్క్ చేసి వస్తానన్నాను. మేమిద్దరం కలిసి వెళ్లి ఎన్టీఆర్‌కు కథ చెప్పాం. ఆయన కథ విని.. ఇది మామూలు కథ కాదు, ఈ మధ్య కాలంలో ఇలాంటి కథే రాలేదు, ఇది వంద శాతం సమయం తీసుకుని చేయాల్సిన సినిమా అన్నారు. వెంటనే ఆ కథ మీద పనిచేయడం మొదలుపెట్టాం.
బీవీఎస్ రవి, నేను, రత్నం కలిసి చాలా రోజులు పనిచేశాం.అయితే, ఈ కథ కోసం పనిచేస్తున్న టైంలో దిల్ రాజు సోదరుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని తెలిసి మా కథలో ఆ అంశాన్ని కూడా జోడించాం. కథ చాలా బాగా వచ్చింది. ఫైనల్ కథను ఎన్టీఆర్‌కు చెప్పాం. ఆయన కథ విన్నప్పుడు ఏమైందో తెలీదు కానీ ‘ఈ కథ నాకు వర్కౌట్ అవుతుందా?’ అని డౌట్ పడ్డారు. నాలుగైదు నెలలు పనిచేసిన ప్రాజెక్ట్‌ను ఆయన డౌటు పడి ఇది వేరే హీరో చేస్తే బాగుంటుంది అన్నారు.
ఒక్క సెకను నేను బ్లాంక్ అయ్యాను. ఆ కథ నేను ఆరోజు చేసి ఉంటే శ్రీమంతుడు, శతమానం భవతి, మహర్షి కథలు బయటికి వచ్చేవి కావు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ కథ నేను చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ఇది బ్రహ్మాండంగా నచ్చింది. కానీ ఆయన తన అన్నయ్య గారి పార్టీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ కథను చేయలేకపోయారు. అప్పుడు ఈ కథను పక్కన పెట్టేసి రాజు గారి నిర్మాణంలో హీరో రామ్ తో ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!