Sujeeth, Pawan Kalyan: అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు పవన్.. సుజీత్ ఏం చేస్తాడో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. కానీ వాటిని పూర్తి చేసే సమయం ఆయనకు దొరకడం లేదు. రాజకీయాలతో బిజీ అవ్వడంతో.. సినిమా షూటింగ్స్ కోసం డేట్స్ కేటాయించలేకపోతున్నారు. దీంతో ఆయన్ను నమ్ముకున్న దర్శకులు అప్సెట్ అవుతున్నట్లు టాక్. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఒక్కటే పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం పవన్ ను నమ్ముకున్న కొంతమంది హీరోలు, దర్శకులు బాగా డిజప్పాయింట్ అవ్వడం ఖాయం.

‘సాహో’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు దర్శకుడు సుజీత్. ‘రన్ రాజా రన్’ సినిమాతో హిట్టు కొట్టిన సుజీత్.. ప్రభాస్ కోసం చాలా ఏళ్లు ఎదురుచూశారు. ఫైనల్ గా ‘సాహో’ సినిమాకి ప్రభాస్ డేట్స్ ఇస్తే.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో సుజీత్ కి కాస్త బ్రేక్ వచ్చింది. మధ్యలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు.

అయితే సుజీత్ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చిరుకి నచ్చలేదు. దీంతో ఆ ఆఫర్ చేజారింది. ఆ తరువాత సుజీత్.. పవన్ ని కలిసి కథ చెప్పారు. దానికి ఇంప్రెస్ అయిన పవన్ ఓకే అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా 2024 వరకు టేకాఫ్ అవ్వదని క్లారిటీ వచ్చేసింది. మరిప్పుడు సుజీత్ ఏం చేస్తాడనేది చూడాలి.

వేరే హీరోతో ఏదైనా సినిమా చేస్తారా..? లేదా ప్రభాస్ కోసం ఎదురుచూసినట్లు పవన్ కళ్యాణ్ కోసం కూడా వెయిట్ చేస్తారా..? అనేది తేలాల్సివుంది. వీరి కాంబినేషన్ లో ‘తేరి’ రీమేక్ వస్తుందని అంటున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus