Sukumar: ‘గాంధీ తాత చెట్టు’ ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సుకుమార్ (Sukumar) కూతురు సుకృతి ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మీడియా మీట్ ఈరోజు హైదరాబాద్లోని, ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకే నిర్మాతలైన మైత్రి వారు ఈ మీడియా మీట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో సుకుమార్ స్పీచ్ హైలెట్ అయ్యింది. సుకుమార్ మాట్లాడుతూ.. “సుకృతికి సింగింగ్ అంటే చాలా ఇష్టం.9వ నెలలోనే పాడటం మొదలు పెట్టింది.

Sukumar

కానీ యాక్టింగ్ రాదు. పద్దు అక్క, సింధు అక్క మాకు కథ చెబుతున్నప్పుడు నన్ను ‘గెటౌట్’ అంది సుకృతి. నా పిల్లలని నేను సినిమా షూటింగ్ కి తీసుకెళ్ళను. ఎందుకంటే వాళ్ళు వస్తే నా ఫోకస్ షూటింగ్ పై ఉండదు. కానీ పాటల షూటింగ్ టైంలో మాత్రం రమ్మంటాను. ఎందుకంటే ఆ టైంలో నేను ఫ్రీగా ఉంటాను. అంతా కొరియోగ్రాఫర్ చూసుకుంటారు. తర్వాత పద్దు అక్క, సింధు అక్క.. నిజంగానే సుకృతి నటించగలదా లేక..

సుకుమార్ (Sukumar) కూతురు కదా చేసేస్తుంది అంటున్నారా? కావాలంటే మీరు తీసిన దానికి డబ్బులు ఇచ్చేస్తాను ఆపేయండి అన్నాను. అయితే నాకు ఒకటి, రెండు సీన్లు నాకు పంపింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. బాగుంది అని చెప్పడానికి కూడా నాకు మాటలు రాలేదు. తర్వాత ‘ఆర్య’ (Aarya) కథ నేను చిరంజీవి (Chiranjeevi) గారు చెప్పినప్పుడు.. అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి అతను చెప్పిన విధానాన్ని కెమెరాతో తీస్తే.. అది హిట్టే అని చెప్పారు. సరిగ్గా అలానే నాకు పద్దు అక్క విషయంలో అనిపించింది.

సినిమాని ఎలా కంప్లీట్ చేశారో తెలీదు. క్రౌడ్ ఫండింగ్ తో చేసారా? మరి ఎలా చేశారు? అనేది తెలీదు. మొత్తానికి అమెరికాలో మైత్రి వాళ్ళు సినిమా చూసి ‘బాగుంది..మనం చేద్దాం’ అని అన్నారు. అప్పుడు నమ్మకం వచ్చింది. మనం సినిమా బాగా తీసి 3 గంటలు జనాల్ని కూర్చోబెడితే క్రైమ్ రేటు తగ్గిపోతుంది అని నమ్మే వ్యక్తిని నేను.

కానీ బిజినెస్ సంగతి నాకు తెలీదు. దాని కోసం ఎంటర్టైన్ చేయడం మాత్రమే వచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ కూడా ఇవ్వడం అనేది అదృష్టం. అది పద్దు అక్కకి కలిగింది. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది అని నేను నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ సూపర్ హిట్ సినిమాల నుంచి సందీప్ ని తప్పించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus