Sukumar: ఆ విషయంలో జక్కన్నను మించిపోయిన సుకుమార్.. ఏం జరిగిందంటే?

పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) మూవీ దాదాపుగా మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకొన్న సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ అభిమానులు సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ క్లైమాక్స్ కు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. మొదట డమ్మీలతో క్లైమాక్స్ షూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది.

డమ్మీలతో షూట్ పర్ఫెక్ట్ గా వస్తే ఆ తర్వాత ఒరిజినల్ యాక్టర్లతో సుకుమార్  (Sukumar)  షూట్ చేయనున్నారని సమాచారం. పర్ఫెక్షన్ విషయంలో సుకుమార్ జక్కన్నను (S. S. Rajamouli) మించిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు క్లైమాక్స్ కీలకం కావడంతో సుకుమార్ ఈ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.

పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీకి (Allu Arjun) నేషనల్ అవార్డ్ వచ్చింది. పుష్ప ది రూల్ సినిమాతో బన్నీకి ప్రశంసలతో పాటు అవార్డులు సైతం రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. బన్నీ భవిష్యత్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ మూవీ పూర్తైన వెంటనే బన్నీ త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ నెల 6వ తేదీన విడుదల కానుంది. 2025 సంక్రాంతి సినిమాలు రిలీజయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా కొనసాగనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బన్నీ కెరీర్ పరంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus