Sukumar: కార్తికేయ నిర్మాత సుకుమార్ కొత్త సినిమా.. హీరో ఎవరంటే?

  • November 5, 2022 / 12:18 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ గురించి అందరికీ తెలిసిందే. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారని సందేహం ప్రతి ఒక్కరిలో కలిగింది. ఈ క్రమంలోనే సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని కార్తికేయ 2,

దికాశ్మీర్ ఫైల్స్ వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇద్దరూ కలిసి డైరెక్టర్ సుకుమార్ ను కలిశారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో, వివేక్ అగ్నిహోత్రి కో ప్రొడ్యూసర్ గా సరికొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇలా ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియగానే ఆ సినిమా సూపర్ హిట్ అనే ఆలోచన అందరిలోనూ కలుగుతుంది. అయితే ఈ కాంబినేషన్లో నటించబోయే హీరో ఎవరు అనే విషయం గురించి ఆసక్తి నెలకొంది.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్లో నటించబోయే హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సుకుమార్ రామ్ చరణ్ పై ఆల్రెడీ ఇంట్రో సీన్స్ తెరకెక్కించారని ఈ కాంబినేషన్లో రాంచరణ్ హీరోగా నటించబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ కాయమంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus