తమిళ దర్శకుడు సుందర్.సి అందరికీ తెలిసే ఉండొచ్చు. గతంలో ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘అరుణాచలం’ అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించారు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన సినిమాలు దాని స్థాయిలో అయితే ఆడలేదు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈయన ‘చంద్రకళ’ దర్శకుడిగానే తెలిసుండొచ్చు. ‘చంద్రకళ’ లాంటి కథతోనే వాటికి సీక్వెల్ అంటూ ‘కళావతి’ (Aranmanai 2) ‘అంతఃపురం’ (Aranmanai 3) వంటి సినిమాలను ఈయన తెరకెక్కించాడు. ఇప్పుడు ‘బాక్’ అనే మరో చిత్రాన్ని రూపొందించాడు సుందర్ సి (Sundar. C) . తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న అంటే మే 3 న రిలీజ్ అయ్యింది.
మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. మళ్ళీ అదే కథ, అవే సీన్లు, అదే రొట్ట కొట్టుడు కామెడీ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇది పక్కన పెడితే ‘బాక్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సుందర్ సి.. టాలీవుడ్ డైరెక్టర్స్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నేను ఓ తెలుగు సినిమా చూసి షాకయ్యాను. ఎందుకంటే అందులో సీన్స్ నేను తీసిన సినిమాలో ఉన్నట్టే ఉన్నాయి.
చాలా చాకచక్యంగా నా కంటెంట్ ని కాపీ కొట్టారు. అదే కాదు.. నేను చేసిన మరో 4 సినిమాల్లోని సీన్స్ ని కూడా కాపీ కొట్టారు. ఒక్కసారిగా నేనే షాక్ అయ్యాను. ఈ రేంజ్ లో ‘కాపీ ఎలా కొడతార్రా?’ అని. అందుకే ప్రతీకారంగా వాళ్ళు నావి 5 సినిమాలను కాపీ కొడితే నేను 8 సినిమాలు కాపీ కొట్టి ‘విన్నర్’ సినిమాని తీశాను. ఆ సినిమాతో తెలుగు దర్శకుల మీద నేను పగ తీర్చుకున్నారు