Teja, Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పిన డైరెక్టర్ తేజ.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమలతో ప్రభాస్ కెరీర్ పరంగా తప్పటడుగులు వేయకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మూడు సినిమాలకు 2,000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు తేజ గోపీచంద్ తో రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంచితనం విషయంలో స్టార్ హీరో ప్రభాస్ వెయ్యి రెట్లు గొప్పోడని తేజ అన్నారు. గోపీచంద్ మాట్లడుతూ జయం సినిమాకు నా పేరును ఎవరు సూచించారని అడగగా మీ పేరు రావడానికి కారణం మీ డాడీ అని తేజ అన్నారు. నేను టి.కృష్ణ గారి దగ్గర పని చేశానని ఆయన నాతో మాట్లాడిన స్టైల్ కానీ, పద్ధతి కానీ, అందరితో మాట్లాడిన విధానం చూశానని ఆ గుడ్ విల్ నాకు ఎంతో నచ్చిందని తేజ కామెంట్లు చేశారు.

తల్లీదండ్రులు పుణ్యం చేసుకుంటే పిల్లలు బాగుంటారని చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నానని మీ నాన్న చేసిన మంచి వల్ల జయం మూవీలో నీకు ఛాన్స్ వచ్చిందని తేజ పేర్కొన్నారు. ప్రభాస్ 1000 రెట్లు గుడ్ హ్యూమన్ బీయింగ్ అని గుడ్ పర్సన్ అని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో కానీ బయట కానీ ప్రభాస్ ను అందరూ ఇష్టపడతారని తేజ కామెంట్లు చేశారు.

టి.కృష్ణను ఎవరైనా ఏమైనా అంటే నాకు చాలా కోపం వచ్చేదని (Teja) తేజ వెల్లడించడం గమనార్హం. అప్పట్లో హీరోలలో సూపర్ స్టార్ కృష్ణంరాజుకు డైరెక్టర్లలో టి.కృష్ణకు మంచి పేరు ఉండేదని తేజ చెప్పుకొచ్చారు. దాసరి గారు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవారని తేజ అన్నారు. గోపీచంద్ కూడా అదే స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నానని తేజ తెలిపారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus