Uday Kiran: నేను చనిపోయేలోపు ఆ విషయాన్ని బయటపెడతా: తేజ

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కి కెరీర్ ఆరంభంలో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆయన నటించిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాలు అప్పట్లో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇదే సమయంలో విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారాయన. పెళ్లి తరువాత కూడా అతడు నటించిన సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. సినిమాల కెరీర్ పక్కనపెడితే.. తన లైఫ్ లో ఆయన ఎలాగోలా కాలం గడుపుతున్నారని అందరూ భావించారు.

కానీ సడెన్ గా ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఎందరో అభిమానించే నటుడు ఉరేసుకొని చనిపోవడం చాలా మందిని బాధపెట్టింది. ఇండస్ట్రీకి చెందిన వారు కూడా బాధపడ్డారు. ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడంపై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేశారు. కానీ ఎవరికీ కచ్చితమైన కారణాలు తెలియదు. దర్శకుడు తేజ మాత్రం ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తనకు తెలుసని అంటున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.

ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారని తేజ అన్నారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు తేజ. ఉదయ్ కిరణ్ చావుకి కారణమేంటో ఇప్పుడు చెప్పే ధైర్యం తనకు లేదని.. కానీ తాను చనిపోయేలోపు ఏదో ఒక సమయంలో ఆ విషయాన్ని బయటపెడతానని అన్నారు.

దర్శకుడు తేజ టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా మంది నటీనటులను పరిచయం చేశారు. అందులో ఉదయ్ కిరణ్ ఒకరు. ‘చిత్రం’ సినిమాతో ఉదయ్ ని హీరోగా పరిచయం చేశారు తేజ. ప్రస్తుతం తేజ ‘అహింస’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus