డైరెక్టర్ తేజ ప్రస్తుతం అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విలేకరులు అడిగే ప్రశ్నలకు తేజ తన స్టైల్ లో సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా విలేకరి ప్రశ్నిస్తూ సినిమాలో హింస చూపెడుతూ టైటిల్ మాత్రం అహింస పెట్టారు. ఇలా పెట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.. తేజ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ అహింస అని టైటిల్ పెట్టి గాంధీ గారితో సినిమా తీయాలా? ఇందులో హింస కరెక్టా అహింస కరెక్టా అన్నది సినిమా చూస్తే అర్థమవుతుందని తెలిపారు.
ఇక మరో విలేఖరి ప్రశ్నిస్తూ సాధారణంగా మీ సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లను కొడతారని అంటారు అహింస సినిమాలో కూడా హీరో హీరోయిన్లను కొట్టారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ నేను హీరో హీరోయిన్లను కొట్టడం మీరు చూశారా అంటూ ఎదురు ప్రశ్నే వేశారు. ఇక ఈ సినిమా గురించి తేజ మాట్లాడుతూ పలు విషయాలను కూడా వెల్లడించారు. అహింస సినిమా కోసం తాను అభిరామ్ ను బాగా టార్చర్ పెట్టిన విషయం మాత్రం వాస్తవమేనని తెలిపారు.
రామానాయుడు స్టూడియో నుంచి కొండపైకి వరకు ప్రతిరోజు సైకిల్ తొక్కాలని చెప్పాను అయితే నేను చెప్పిన ఏ విషయానికి అడ్డు చెప్పకుండా ప్రతిదీ చేసేవారని తేజ తెలిపారు.అలాగే 50 కిలోల బరువు ఎత్తుకొని కొండ చుట్టూ పరుగులు తీయమని చెప్పాను అది కూడా చేశారని తేజ తెలిపారు ఇలా ఈ సినిమా కోసం అభిరామ్ ను చాలా టార్చర్ పెట్టాను అంటూ (Director Teja) తేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.