Rakshasa Raja: రిపీట్ కాబోతున్న నేనే రాజు నేనే మంత్రి కాంబో!

  • December 14, 2023 / 03:22 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దగ్గుబాటి వారసుడుగా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు రానా . లీడర్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. ఇలా కథ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలలో విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా సిద్ధంగా ఉన్నారని చెప్పాలి.

ఇకపోతే నేడు రానా పుట్టిన రోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈయనకు సినిమా సెలబ్రిటీల నుంచి వరుసగా పుట్టినరోజు శుభాకాంక్షలు వస్తున్నాయి అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే రానా పుట్టినరోజు కావడంతో ఈయన కొత్త సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

గతంలో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ కాంబినేషన్లో త్వరలోనే సినిమా రాబోతుంది అంటూ గతంలో తేజ వెల్లడించారు. దీంతో తేజ రానా కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులలో కూడా ఆత్రుత నెలకొంది. ఇక నేడు రానా పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించినటువంటి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

తేజ దర్శకత్వంలో రానా నటించబోతున్నటువంటి చిత్రం రాక్షస రాజా. ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ కనుక చూస్తే రానా ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.భుజంపై గ‌న్ పెట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో రానా క‌నిపిస్తోన్నాడు. అత‌డి నుదిటిపై విభూతి బొట్టు, నోటిలో సిగరెట్ ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా రాక్ష‌స‌రాజా మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను తెలియచేయనున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus