ఒకప్పుడు సినిమా విడుదలవుతుంది అంటే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి చూసేవారు. అయితే ఇప్పుడు మాత్రం థియేటర్లకు పూర్తిస్థాయిలో ఆదరణ తగ్గిపోయిందని చెప్పాలి. కరోనా సమయంలో థియేటర్లో మూతపడటం చేత ఓటీటీలకు మంచి ఆదరణ వచ్చింది. అలాగే థియేటర్లో విడుదలైన సినిమా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలలో విడుదల కావడంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని భావిస్తున్నారు. ఇలా ఓటీటీలలో సినిమాను చాలా ఆలస్యంగా విడుదల చేస్తే థియేటర్ లో సినిమాలకు మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నారు.
అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఈ వ్యాఖ్యలపై స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా తేజ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఓటీటీలకు ఆదరణ పెరగడం చేత థియేటర్లకు జనాలు రావడం తగ్గించారు అనడంలో వాస్తవం లేదని తెలిపారు. మొదట ప్రజలు నాటకాలు చూసేవాళ్లు. ఆ తర్వాత సినిమా థియేటర్లు వచ్చాయి. అప్పుడు థియేటర్లలో సినిమాలు చూడటం ప్రారంభించారు. ఇక తర్వాత టీవీలు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు టీవీలలో సినిమాలు చూడడం మొదలుపెట్టారు.
కానీ థియేటర్ అలాగే ఉంది. టీవీలు, యూట్యూబ్, ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్ చచ్చిపోలేదు అక్కడ బిగ్ స్క్రీన్ స్క్రీన్ ముందు చిన్నగా ఉంటాం. అక్కడ పెద్ద ఆకారాల్లో హీరో, విలన్ కొట్టుకుంటుంటో ఏదో దేవుళ్లు కొట్టుకుంటున్నట్లు ఉంటుంది. ఆ ఫీల్ ని ప్రేక్షకులు మిస్ కారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలను ఏది చంపడం లేదని కేవలం మల్టీప్లెక్స్ థియేటర్లలో పాప్ కార్న్ రేటు మాత్రమే సినిమాలను చంపుతోందని తేజ వెల్లడించారు.
ఒక ఫ్యామిలీ మొత్తం మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూడాలి అంటే అక్కడ తీసుకునే పాప్ కార్న్ రేటు టికెట్ల కన్నా అధికంగా ఉండటంవల్ల థియేటర్ కు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది అంటూ తేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా