Director Teja: ఎక్స్‌ప్రెషన్ ని కరెక్ట్ గా ఇచ్చేది ఆ హీరోనే.. తేజ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన తేజ ప్రస్తుతం సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లలో తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో నేనే రాజు నేనే మంత్రి మూవీ మాత్రమే సక్సెస్ సాధించింది. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస మూవీ జూన్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నారు.

అటు దగ్గుబాటి అభిరామ్,ఇటు తేజ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తొ తెరకెక్కిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనతో పని చేసిన హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా డైరెక్షన్ లో పని చేసిన హీరోలలో మహేష్ బాబు బెస్ట్ అని ఆయన కామెంట్లు చేశారు. మిగతా హీరోలు ఎక్స్ ప్రెషన్ ఇవ్వడానికి టైమ్ తీసుకుంటారని తేజ అన్నారు.

మహేష్ బాబు మాత్రమే ఇచ్చిన రోల్ కు సంబంధించిన ఎక్స్ ప్రెషన్ ను కరెక్ట్ గా ఇస్తారని తేజ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహేష్ బాబు గురించి తేజ పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన నిజం సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ కావడం గమనార్హం.

రాబోయే రోజుల్లో మహేష్ బాబు తేజ (Director Teja) కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus