Nijam Movie: 20 ఏళ్ళ ‘నిజం’ చిత్రం గురించి తేజ ఆసక్తికర కామెంట్లు!

మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిజం’. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘జయం’ వంటి చిత్రాల తర్వాత తేజ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం.. అలాగే ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ కావడంతో ‘నిజం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది ‘నిజం’.

ఈ మూవీని ‘చిత్రం మూవీస్’ బ్యానర్ పై స్వయంగా తేజ నిర్మించడం జరిగింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా ఆయనకు మంచి బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడానికి కారణం.. ‘ఒక్కడు’ తర్వాత మహేష్ ఇమేజ్ పెరగడం అని తేజ ఓ సందర్భంలో చెప్పాడు. తాను ‘బాబీ’ సినిమా చూశాక ‘నిజం’ చిత్రానికి మహేష్ బాబుని హీరోగా అనుకున్నాడట. అప్పటికి ‘ఒక్కడు’ ఇంకా ప్రారంభం కాలేదు. నిజానికి ‘ఒక్కడు’ కంటే ‘నిజం’ ముందుగా రావాల్సిన మూవీ.

కానీ (Nijam) ‘నిజం’ షూటింగ్ డిలే అవ్వడంతో ‘ఒక్కడు’ ముందుగా వచ్చింది. అయితే ‘నిజం’ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం మంచి హిట్ అని దర్శకుడు తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘నిజం’ చిత్రం తన గత సినిమాలలానే రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిందట. కానీ అందరూ ఈ సినిమా ప్లాప్ అని చెప్పుకుంటారు కానీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఇది అంటూ తేజ చెప్పుకొచ్చారు.

తేజ ఎటువంటి విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పేసుకుంటారు. తన ‘ధైర్యం’ సినిమా బాగా రాలేదు అని తెలిసి.. తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ను కొనకుండా చేసినట్టు కూడా తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అలాగే ‘నిజం’ సినిమా కోసం మహేష్ నేను ఎలా చెబితే అలా చేసాడని కూడా తేజ చెప్పాడు. ఈరోజుతో ‘నిజం’ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus