డైరెక్టర్ తేజ.. అభిరామ్ ని కొట్టారా..?

దర్శకుడు తేజకి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేసి సూపర్ హిట్స్ కొట్టిన ఘనత ఆయన సొంతం. ఇప్పటివరకు దాదాపు వెయ్యి మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని సినిమా ఇండస్ట్రీలో అందించారు. తేజ సినిమా తీస్తున్నారంటే కచ్చితంగా కొత్తవాళ్ల టాలెంట్ వెలుగులోకి వస్తుందని అందరూ నమ్ముతుంటారు. అయితే మేకింగ్ సమయంలో తేజ ప్రవర్తనపై చాలా మంది కంప్లైంట్స్ చేస్తుంటారు. సెట్ లో నటీనటులపై చేయి చేసుకోవడం చేస్తుంటారు తేజ.

తను అనుకున్నట్లుగా సన్నివేశం రాకపోతే కోపంతో చెంపదెబ్బలు కొడుతుంటారు. ఇదే విషయంపై ఇదివరకు ఆయన ఒకసారి స్పందించారు కూడా. సెట్ లో ఒకరివల్ల ఆలస్యమైతే నిర్మాత చాలా నష్టపోతారని.. ఆ వృథాని అసలు సహించలేనని.. అందుకే చేయి చేసుకోవడం కొన్నిసార్లు తప్పదని అన్నారు. సెట్ లో ఉండేవాళ్లంతా తన శిష్యులే కాబట్టి దాన్ని తప్పుగా అనుకోరని ఇదివరకు ఒకసారి చెప్పారు. ఉదయ్ కిరణ్, కాజల్, నవదీప్ వీరంతా కూడా తేజ చేతిలో దెబ్బలు తిన్నవారే.

ఇప్పుడు ఆయన ఏకంగా సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై చేయి చేసుకున్నట్లు సమాచారం. అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు తేజ. సినిమా షూటింగ్ సమయంలో అభిరామ్ ని కొట్టారట తేజ. సినిమాలో ఓ లెంగ్తీ సీన్ ఒకటి ఉందట. అందులో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డారట. ఎన్నిసార్లు రీషూట్ చేస్తున్నా..

ఆ సీన్ సరిగ్గా రాకపోవడంతో తేజ చేయి చేసుకున్నారట. దీంతో అభిరామ్ కొన్నిరోజులు పాటు అలిగి.. షూటింగ్ కూడా డుమ్మా కొట్టారట. ఈ సినిమాను సురేష్ బాబే నిర్మిస్తున్నారు. దీంతో ఆయన అభిరామ్ కి సర్ది చెప్పి మళ్లీ షూటింగ్ కి పంపించారట. ఈ విషయంపై తేజ కానీ అభిరామ్ కానీ స్పందిస్తారేమో చూడాలి!

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus