దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పీచ్ అదిరిపోయిందిగా!

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ లో హైప్ ఇచ్చి మాట్లాడడానికి నిర్మాతలు జంకుతున్నారు. ఎందుకంటే సినిమా రిజల్ట్ ఏమైనా తేడా కొడితే ట్రోల్స్ కి, మీమ్స్ కి బలైపోవాల్సి వస్తుంది. అందుకే సినిమా ఎంత బాగా వచ్చినా.. కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు. మా సినిమా బాగా వచ్చింది.. సినిమా చూసి ఎలా ఉందో మీరే చెప్పండి అంటూ దర్శకనిర్మాతలు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కొంతమంది దర్శకులు తమ సినిమాల గురించి గొప్పగా మాట్లాడారు.

తీరా చూస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ‘ధమాకా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాను పొగుడుతూ ఆయన ఇచ్చిన ప్రసంగం అదిరిపోయింది. ‘సినిమా అదిరిపోయింది.. త‌మ్ముళ్లూ… నాలుగు బ‌స్తాల పేప‌ర్ ముక్క‌లు ఆర్డ‌ర్ చేశాను.. ఇక చూసుకోవాల్సిన ప‌ని లేదు’ అంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు.

త్రినాథరావు స్పీచ్ విని హీరో రవితేజ కూడా షాకైపోయారు. యాంకర్ సుమకి మాటలే రాలేదు. వెంటనే ‘నాకు మాట్లాడడానికి కూడా ఏం మిగల్చలేదు’ అంటూ నవ్వేసింది. మాటలతో పాటు స్టేజ్ పై స్టెప్పులు కూడా వేశారు త్రినాథరావు. రవితేజ బాడీ లాంగ్వేజ్ ను అనుకరిస్తూ త్రినాథరావు నక్కిన చాలా ఎగ్జైటెడ్ గా డాన్స్ చేయడం హైలైట్ అయింది. ఆయన మాటల్లో ‘ధమాకా’ సినిమా సూపర్ హిట్ అవుతుందనే ధీమా కనిపించింది.

హిట్ అయితే పర్వాలేదు కానీ లేదంటే మాత్రం ట్రోలర్స్ కి కంటెంట్ అయిపోతారు. అయినప్పటికీ.. ఆయన అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడారంటే సినిమాలో కచ్చితంగా మేటర్ ఉండే ఉంటుంది. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus