Vakkantham Vamsi: ఆ విషయంలో ఎన్టీఆర్ ఫేవరెట్ అన్న వక్కంతం.. ఇవే రీజన్లంటూ?

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన వక్కంతం వంశీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలకు దర్శకుడిగా పని చేసిన వక్కంతం వంశీ ఈ సినిమాలతో ఆశించిన విజయాలను సొంతం చేసుకోకపోయినా దర్శకునిగా క్రేజ్ ను పెంచుకున్నారు. వక్కంతం వంశీ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. స్టార్ రైటర్ గా కూడా గుర్తింపును సొంతం చేసుకున్న వక్కంతం వంశీ

దాదాపుగా 10 సినిమాలకు కథ అందించగా ఆ సినిమాలలో కిక్ , రేసుగుర్రం, ఎవడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ వక్కంతం వంశీ కాంబోలో ఒక సినిమా చాలా సంవత్సరాల క్రితమే తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు. సరైన కథ సెట్ కాకపోవడంతో ఈ కాంబోలో సినిమా తెరకెక్కలేదని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి నేను వీరాభిమానినని వక్కంతం వంశీ కామెంట్లు చేశారు.

వ్యక్తిగతంగా నేను తారక్ తో ట్రావెల్ చేశానని ఆ విషయంలో తారక్ ఫ్యాన్ అని వక్కంతం వంశీ కామెంట్లు చేశారు. తారక్ తో భవిష్యత్తులో వక్కంతం వంశీ సినిమాను తెరకెక్కిస్తారేమో చూడాల్సి ఉంది. అశోక్, ఊసరవెల్లి, టెంపర్ సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించగా ఈ సినిమాలలో టెంపర్ మాత్రమే హిట్టైంది.

వక్కంతం వంశీ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Vakkantham Vamsi) వక్కంతం వంశీ పాన్ ఇండియా కథలపై దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వక్కంతం వంశీ సినిమా సినిమాకు మరింత ఎదగాలని అభిమానులు ఫీలవుతున్నారు. సురేందర్ రెడ్డి పవన్ కాంబో సినిమాకు కూడా వక్కంతం వంశీ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus