Vashishta: కళ్యాణ్ రామ్ మూవీతో సమస్య ఇదే.. వశిష్ట ఏం చెప్పారంటే?

చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో విశ్వంభర టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. చిరంజీవి టాప్3 సినిమాలలో ఈ సినిమా ఒకటిగా ఉండాలని నేను ఫీలవుతానని వశిష్ట పేర్కొన్నారు. నాపై ఉంటే వినాయక్ గారి ఇన్స్పిరేషన్ ఎక్కువగా ఉంటుందని వశిష్ట వెల్లడించారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా క్లోజ్ అని వశిష్ట పేర్కొన్నారు.

చిరంజీవికి మెగాస్టార్ అనే ఇమేజ్ ఉందని విశ్వంభర క్యాస్టూమ్ డ్రామా కాదని ఆయన కామెంట్లు చేశారు. విశ్వంభరలో ఎక్కడా చిరంజీవి స్టైల్ మిస్ కాదని వశిష్ట పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి 20 శాతం షూటింగ్ పూర్తైందని ఆయన కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు విని నవ్వుతానని వశిష్ట పేర్కొన్నారు. విశ్వంభర సినిమాలో ఒక్కరే హీరోయిన్ అని ఆయన కామెంట్లు చేశారు.

హర్రర్ సినిమాలు అంటే భయం అని విరూపాక్ష మూవీ మాత్రం బాగా నచ్చిందని వశిష్ట పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాలను చూసి ఇన్స్పైర్ అవుతామని హిందీ సినిమాలు మాత్రం చాలా తక్కువగా చూస్తానని ఆయన అన్నారు. బింబిసార సీక్వెల్ గురించి వశిష్ట మాట్లాడుతూ బింబిసార2 సినిమాకు నేను పని చేయడం లేదని ఆయన తెలిపారు. కళ్యాణ్ రామ్ కు చెప్పి విశ్వంభర చేస్తున్నానని వశిష్ట అన్నారు.

బింబిసార వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని వశిష్ట (Vashishta) కామెంట్లు చేశారు. బింబిసార2 లైన్ విషయంలో బేధాభిప్రాయాల వల్లే ఆ సినిమా చేయడం లేదని వశిష్ట పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇండస్ట్రీలో అందరు హీరోలతో పని చేయాలని ఉందని ఏం జరుగుతుందో తెలియదని ఆయన వెల్లడించారు. చరణ్ తన క్లాస్ మేట్ అని వశిష్ట పేర్కొన్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus